AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTGS And NEFT: బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీలపై కీలక నిర్ణయం.!

RTGS, NEFT Money Transfer Facilities: బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది...

RTGS And NEFT: బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీలపై కీలక నిర్ణయం.!
Rbi
Ravi Kiran
|

Updated on: Apr 07, 2021 | 6:37 PM

Share

RTGS, NEFT Money Transfer Facilities: బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(ఎన్‌ఈఎఫ్‌టీ), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(ఆర్‌టీజీఎస్) ఫీచర్లను డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తున్న థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లకు విస్తరించింది.

ఇప్పటి వరకు, బ్యాంకులు మాత్రమే RTGS, NEFT చెల్లింపుల సదుపాయాన్ని ఉపయోగించడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. ఇకపై ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్(పిపిఐ) ప్రొవైడర్స్, కార్డ్ నెట్‌వర్క్‌లు, వైట్ లేబుల్ ఏటిఎం ఆపరేటర్లు, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (టిఆర్‌డిఎస్) ప్లాట్‌ఫారమ్‌లు కూడా RTGS, NEFT చెల్లింపుల సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. అటు కేంద్ర బ్యాంక్ రోజువారీ లావాదేవీలను సైతం లక్ష నుంచి రెండు లక్షలకు పెంచింది.

“ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం.. ఆన్‌లైన్ చెల్లింపులు, భారత ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్‌ వైపు అడుగులు వేసేందుకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ సోని అన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే NEFT, RTGS సౌకర్యాలు అందుబాటులో ఉండటం ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి తోడ్పడుతుందని తెలిపారు”.

రెపో రేటు, రివర్స్ రెపో రేటును యధాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా…రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండగా…ఈ కీలక వడ్డీ రేట్లనే యధాతథంగా కొనసాగనున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంచనాను 10.5 శాతంగా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) ఉంచినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ‘ఆన్ ట్యాప్ టిఎల్‌టిఆర్‌ఓ’ పథకాన్ని ఆరు నెలల పాటు 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!