Multibagger stock: ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించిన స్టాక్.. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.82 లక్షలు..
పెన్నీ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరం ఎందుకంటే అవి ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియదు...
పెన్నీ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరం ఎందుకంటే అవి ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. కానీ ఇలాంటి స్టాక్‌లు మల్టీ రిటర్న్స్ ఇస్తాయి. ఇలాంటి మల్టీ రిటర్న్స్ ఇస్తున్న స్టాక్‌ల్లో సింధు ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ ఒకటి. ఈ మిడ్-క్యాప్ స్టాక్ కొన్నేళ్లుగా దాని పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇస్తోంది. ఈ కంపెనీ షేరు విలువ 5 సంవత్సరాలలో రూ.1.69 (BSEలో 17 ఫిబ్రవరి 2017న ముగింపు ధర) నుండి రూ.139.25 (BSEలో 11 ఫిబ్రవరి 2022న ముగింపు ధర) ఒక్కో స్థాయికి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 8100 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
సింధు ట్రేడ్ లింక్స్ లిమిటెడ్‌లో నెల క్రితం రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే దాని విలువ ఇప్పుడు1.60 లక్షలకు చేరి ఉండేది. ఒక పెట్టుబడిదారుడు 6 నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.14.50 లక్షలకు చేరేది. ఒక సంవత్సరం క్రితం స్టాక్‌లో లక్ష రూపాయలు పెడితే దాని విలువ ఈరోజు ₹21 లక్షలకు చేరి ఉండేది. ఇందులో 5 సంవత్సరాల 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉండే ఇప్పుడు ఆ లక్ష రూపాయల విలువ రూ. 82 లక్షలకు చేరి ఉండేది.
Note: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.
Read Also.. JIO: జియో ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ యాక్సెస్.. అపరిమిత డేటా, కాల్స్..?