Bikes: స్టైల్ అండ్ లుక్‌లో ఈ బైక్స్‌తో కిక్కే కిక్కు.. ది బెస్ట్ బైక్ ఏదంటే?
ప్రస్తుత రోజుల్లో యువత అధికంగా మోటర్ బైక్స్ వాడుతున్నారు. ముఖ్యంగా లుక్‌తో పాటు అధునాత ఫీచర్లతో వచ్చే స్కూటర్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాగే రోడ్లపై రయ్ రయ్‌మంటూ దూసుకెళ్లేలా స్పోర్టీ లుక్స్‌తో వచ్చే బైక్స్‌ను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీ 450 సీసీ ఇంజిన్‌తో బైక్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450, బజాజ్ డొమినార్ 450 బైక్స్ మధ్య ప్రధాన తేడాలను తెలుసుకుందాం.

రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 ధర బేస్ వేరియంట్ ధర రూ.2.79 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ మూడు వేరియంట్ ఎంపికలలో లభిస్తుంది. బజాజ్ డొమినార్ 400 ధర గెరిల్లా 450 మాదిరిగానే రూ.2.79 లక్షలు ధరతో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ బైక్ ఒకే వేరియంట్ ఎంపికలో లభిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 కొనుగోలుదారులు ఆరు రంగుల ఎంపికల నుంచి ఎంచుకోవచ్చు. బజాజ్ డొమినార్ 400 కొనుగోలుదారులు రెండు రంగు ఎంపికల నుండి ఎంచుకోవచ్చు.
రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450లో ఉన్న ఫీచర్లు డొమినార్ 400 కంటే ఎక్కువగా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ టాప్ స్పెక్ మోడల్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందిస్తుంది. ఇది గూగుల్ మ్యాప్స్ కనెక్టివిటీతో వస్తుంది. యూఎస్‌బీ ఛార్జర్, ఇతర లక్షణాలు ఆకట్టుకుంటాయి. మరోవైపు డొమినార్ 400 లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు టెయిల్ లాంప్‌లు వంటి పీచర్లు ఆకర్షిస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450లో 452సీసీ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. అలాగే ఈ బైక్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 39 బీహెచ్‌పీ పవర్, 40 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ డొమినార్ 400లో 373సీసీ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో 39 బీహెచ్‌పీ పవర్, 35 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ బైక్ కూడా ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
400 సీసీ సెగ్మెంట్ మోటార్ సైకిళ్లు ఇటీవల మార్కెట్లో ఊపందుకున్నాయి. మరిన్ని ఫీచర్లతో కూడిన మోటార్ సైకిల్ కోరుకునే కొనుగోలుదారులు రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450ను ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మరింత మెరుగైన పనితీరు కోసం చూస్తున్న కొనుగోలుదారులు బజాజ్ డొమినార్ 400 ఎంచుకోవచ్చని పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








