AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric scooters: స్మార్ట్ లుక్.. సూపర్ రేంజ్.. ఆకట్టుకుంటున్న కొత్త ఎలక్టిక్ స్కూటర్లు

ద్విచక్ర వాహనం అనేది నేడు ప్రతి ఒక్కరికీ అత్యవసరంగా మారింది. వివిధ పనులతో పాటు ప్రయాణం, వ్యాపారం, టూర్లకు చాలా ఉపయోగపడుతోంది. గతంలో కుటుంబానికి ఒక మోటారు బైక్ ఉండేది. కానీ నేడు మహిళలు, మేజర్లైన పిల్లలకు కూడా ప్రత్యేకంగా వాహనాలు వచ్చేశాయి.

Electric scooters: స్మార్ట్ లుక్.. సూపర్ రేంజ్.. ఆకట్టుకుంటున్న కొత్త ఎలక్టిక్ స్కూటర్లు
E Scooters
Nikhil
|

Updated on: May 16, 2025 | 1:30 PM

Share

ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కోనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సులభంగా చార్జింగ్ చేసుకోవడం, లేటెస్టు ఫీచర్లు, టెక్నాలజీతో ఇవి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వివిధ కంపెనీలు ఈ విభాగంలో అనేక మోడళ్లను విడుదల చేస్తున్నాయి. డిజైన్, పనితీరులో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మార్కెట్ లోకి రానున్న, కొత్తగా విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.

సుజుకి ఇ-యాక్సెస్

సుజుకీ ఇ- యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాది మార్కెట్ లోకి విడుదల కానుంది. దీనిలో 3.072 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన 51.2వీ లీథియం ఐరన్ ఫాస్పేట్ (ఎల్ఈపీ) బ్యాటరీ ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి సింగిల్ చార్జిపై సుమారు 95 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. అలాగే 4.1కేబ్ల్యూ మోటారు నుంచి 15 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. 160 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 765 ఎంఎం ఎత్తయిన సీటు, 122 కేజీ కర్బ్ మాస్ దీని ప్రత్యేకతలు. ట్యూబ్ లెస్ టైర్లు, 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ సెటప్, ఇ-యాక్సెస్ హెడ్ లైట్, టెయిల్ లైట్ ఆకట్టుకుంటున్నాయి.

అల్ట్రావైలెట్ టెస్సెరాక్ట్

అల్ట్రావైలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్లతో ఎంతో ఆకట్టుకుంటోంది. మార్చిలో ఈ స్కూటర్ ను ఆవిష్కరించారు. ప్రారంభ ధర రూ.1.45 లక్షలుగా నిర్దారణ చేశారు. బుక్కింగ్ చేసుకున్న కస్టమర్లకు 2026 మొదటి త్రైమాసికంలో డెలివరీ చేస్తారు. దీనిలో 20.1 బీహెచ్పీ ఎలక్ట్రిక్ మోటారు ఏర్పాటు చేశారు. బ్యాటరీ గురించి స్పష్టంగా తెలియదు. సింగిల్ చార్జింగ్ పై 261 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. గంటకు 125 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణం చేయవచ్చు. అంతర్మిర్మిత నావిగేషన్, ముందు వెనుక డ్యాష్ కామ్ లు, వైర్ లెస్ చార్జింగ్, డ్యూయల్ చానల్ ఏబీఎస్, 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ బాగున్నాయి. ఫ్లోటింగ్ డీఆర్ఎల్ లు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ లతో డ్యయూల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు, 34 లీటర్ అండర్ సీట్ స్టోరేజీ అదనపు ప్రత్యేకతలు.

ఇవి కూడా చదవండి

అల్ట్రావైలెట్ షోచ్ వేవ్

బైక్ లపై ఆసక్తి ఉన్నవారి కోసం అల్ట్రావైలెట్ నుంచి షోచ్ వేవ్ అనే మోటారు సైకిల్ విడుదలైంది. దీని ధరను రూ.1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. ఈ బైక్ డెలివరీలు 2026 ప్రారంభంలో మొదలవుతాయి. తేలికగా ఉండే ఈ బైక్ సింగిల్ చార్జిపై 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గంటలకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. కేవలం 2.9 సెకన్లలో సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. సూపర్ నోవా చార్జర్ తో 30 నిమిషాల్లోపు 20 శాతం నుంచి 80 శాతం వరకూ, బూస్ట్ చార్జర్ తో 50 నిమిషాల్లో చార్జ్ చేసుకోవచ్చు. షాక్ వేవ్ డ్యూయల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్, 19, 17 అంగుళాల స్పోక్ట్ వీల్స్ అదనపు ప్రత్యకతలు.

ఫ్లయింగ్ ఫ్లీ సీ6

రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ నుంచి విడుదల ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఇది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరుతో దీన్ని విడుదల చేయనున్నారు. ఆధునిక సాంకేతికత, సూపర్ డిజైన్ తో రూపొందించారు. గుండ్రని హెడ్ ల్యాంప్, బ్లూటూత్ మద్దతు గల టీఎఫ్ టీ డిస్ ప్లే బాగున్నాయి. మిగిలిన ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ముందుగా సీ6 మోడల్ ను విడుదల చేస్తామని, ఆ తర్వాత ఎస్ 6 మోడల్ ఉంటుదని కంపెనీ తెలిపింది. సీ6 బైక్ సింగిల్, డ్యూయల్ సీట్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

హీరో విడా జెడ్

హీరో మోటోకార్ప్ నుంచి విడుదలయ్యే వాహనాలకు మార్కెట్ లో ఉన్న డిమాండ్ తెలిసిందే. మారుతున్న కాలానికీ అనుగుణంగా ఎలక్ట్రిక్ విభాగంలో ఈ కంపెనీ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో విడా జెడ్ పేరుతో కొత్త ఇ-స్కూటర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్ పో ఈ స్కూటర్ ను ప్రదర్శించారు. దీని ప్రత్యేకతలు, ఫీచర్లుపై పూర్తిస్తాయి సమాచారం లేదు. ఈ ఏడాది మార్కెట్ లోకి వస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us