Rich Mindset: డబ్బు సంపాదించాలా..? అయితే ధనవంతుల్లా ఆలోచించండి.. వందన్నా డబ్బు వచ్చి పడుతుంది!
ధనవంతులుగా మారాలంటే వారి ఆలోచనలు, అలవాట్లను అనుకరించాలి. ఆదాయాన్ని పెంచుకొని, ఖర్చులను తగ్గించుకుంటూ పొదుపు, పెట్టుబడిపై దృష్టి పెట్టాలి. రిస్క్‌లను స్వీకరించి, ఆస్తులపై పెట్టుబడి పెట్టాలి. డబ్బుకు విలువ ఇవ్వడం, క్రమశిక్షణతో పనిచేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

దాదాపు ప్రతి ఒక్కరికి బాగా డబ్బు సంపాదించాలని ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడతారు కూడా. కానీ, అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతుంటారు. ఎంత సంపాదించినా డబ్బు మాత్రం చేతిలో నిలవదు. అలాంటి సమయాల్లో మనం ఆల్రెడీ ధనవంతులు అయినా వారిలా ఆలోచించాలి. ఎందుకంటే.. ఏ రంగంలోనైనా అనుభవం ఉన్నవారిని అనుకరించడంతో రాణించవచ్చు.
సచిన్, కోహ్లీలా క్రికెట్ ఆడాలని చాలా మంది అనుకోవచ్చు. కానీ, ముందు వారిలా ప్రాక్టీస్ చేయాలి, నెట్స్‌లో చెమలు చిందించాలి, ఆ తర్వాత వారిలా టెక్నిక్స్ నేర్చుకోవాలి, వాటిని ఆటలో ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు సచిన్ కోహ్లీలు అవ్వొచ్చ.. వారి అంత గొప్పవారిగా కాకపోయినా.. కనీసం దేశానికి ప్రాతినిథ్యం అయినా వహించవచ్చు. అలాగే ధనవంతుల్లా ఆలోచిస్తే, వారిని ఆచరిస్తే.. మీరు కూడా డబ్బు సంపాదనను ఒక అలవాటుగా చేసుకోవచ్చు. వారిలా కోట్లకు కోట్లు సంపాదించకపోయినా.. లక్షల్లో సంపాదించుకోవచ్చు.
ధనవంతుల్లా ఆలోచించడం అంటే..
- సంపాదన పెంచుకోండి.. ఖర్చులను తగ్గించుకోండి!
- పొదుపు మార్గాలను అన్వేషించండి.
- పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోండి.
- రిస్క్ తీసుకునేందుకు భయపడకండి.
- అవసరం లేకపోయినా లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయండి.
- ఆ డబ్బును ఆస్తులపై పెట్టుబడి పెట్టండి.
- భవిష్యత్తును ముందుగానే అంచనా వేయండి.
- డబ్బుకు విలువ ఇవ్వండి.
- ఆడంబరాలకు పోకండి, సింపుల్ లైఫ్ స్టైల్‌ను అలవాటు చేసుకోండి.
- వర్క్ విషయంలో డిసిప్లేన్, డెడికేషన్‌తో ఉండండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
