AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. వాహనదారులకు ఉపశమనం..!

Petrol, Diesel Price: ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని పుకార్లు వినిపించాయి. ఎన్నికలు ముగిసిన మరుక్షణం పెట్రోల్‌పై రూ. 15 నుంచి 20.. డీజిల్‌పై రూ. 10 వరకు పెరుగుతాయని అంచనా వేశారు. కానీ ఐదు రాష్ట్రాల..

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. వాహనదారులకు ఉపశమనం..!
Fuel Price Today
Subhash Goud
|

Updated on: May 01, 2026 | 8:32 AM

Share

Petrol, Diesel Price: మే నెల ప్రారంభంలో సామాన్యులకు, విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ధరలను పెంచకూడదని ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయించాయి.

విమాన ప్రయాణం మరింత భారం కాదు:

సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను సవరిస్తుంటారు. ఒకవేళ ఏటీఎఫ్ ధరలు పెరిగితే విమాన టికెట్ల ధరలు కూడా పెరుగుతాయి. అయితే, మే 1, 2026 నాటి తాజా అప్‌డేట్ ప్రకారం దేశీయ ఎయిర్‌లైన్స్‌కు ఇంధన ధరలను స్థిరంగా ఉంచారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన భారాన్ని కంపెనీలే భరించాలని నిర్ణయించుకోవడం వల్ల విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ప్రస్తుతానికి లేదు.

పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ యథాతథం:

రిటైల్ కస్టమర్ల వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. అలాగే దాదాపు 33 కోట్ల మంది వినియోగించే 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పాత ధరలకే లభిస్తాయి. రేషన్ కార్డుదారులకు ఇచ్చే కిరోసిన్ ధరల్లో కూడా మార్పు లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) స్పష్టం చేసింది. అయితే కిరోసిన్‌ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది.

ఎవరికి భారం పడింది?

దాదాపు 80 శాతం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, కొన్ని వాణిజ్య అవసరాలకు మాత్రం ధరలు పెరిగాయి. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీనిపై కేంద్రం భారీగా పెంచింది. అంతర్జాతీయ విమాన సంస్థలకు అందించే ఏటీఎఫ్, బల్క్ డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు 16 శాతం ఇండస్ట్రియల్ ఫ్యూయల్ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి సాధారణ ప్రజలను కాపాడేందుకు చమురు సంస్థలు ఈ ‘బ్యాలెన్స్‌డ్ అప్రోచ్’ను అనుసరిస్తున్నట్లు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: SBI Credit Card Rule: మీరు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌.. మే 1 నుంచి అమల్లోకి..

వాస్తవానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని పుకార్లు వినిపించాయి. ఎన్నికలు ముగిసిన మరుక్షణం పెట్రోల్‌పై రూ. 15 నుంచి 20.. డీజిల్‌పై రూ. 10 వరకు పెరుగుతాయని అంచనా వేశారు. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. కేంద్రం ఇచ్చిన ఈ ఊహించని ట్విస్ట్‌కు సామాన్య ప్రజలు సంబరపడిపోతున్నారు. అయితే ఈ ధరలు ఇలాగే ఉంటాయా? లేదా తర్వాత పెంచుతారా? అనేది వాహనదారుల్లో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 107.41గా ఉండగా, డీజిల్ ధర రూ.95.65గా ఉంది. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ. 109.25గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.08గా ఉంది.

ఇది కూడా చదవండి: LPG Price: వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌ ధర..!

ఇది కూడా చదవండి: Mahatma Gandhi: మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? నెట్టింట్లో వైరల్‌ అవుతున్న మార్క్ షీట్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us