LPG Price: వినియోగదారులకు భారీ షాకింగ్ న్యూస్.. రూ.993 పెరిగిన సిలిండర్ ధర..!
LPG Cylinder Price: మే 1వ తేదీన గ్యాస్ వినియోగదారులకు భారీ షాకిచ్చాయి ఆయిల్ కంపెనీలు. రికార్డు స్థాయిలో ధర పెంచేశాయి. కార్మికుల దినోత్సవం రోజున ఇది బ్యాడ్‌న్యూస్ అనే చెప్పాలి. ముందే గ్యాస్ కొరత, పెట్రోల్,డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతుంగడా, ఇప్పుడు సామాన్య వినియోగదారులకు మరింత భారీ మోపాయి..

LPG Cylinder Price: దేశంలో మే 1వ తేదీ నుంచి కొత్త గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు సిలిండర్ల ధరలను పెంచాయి. మే 1, 2026 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర సుమారుగా రూ.993 పెరిగింది. ఢిల్లీ, ముంబైతో సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ ధరలు ఇప్పుడు రూ.3,000 దాటాయి. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదని కేంద్రం తెలిపింది.
19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర పెరగడంతో వినియోగదారులకు భారీ షాకిచ్చినట్లయ్యింది. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ రూ.3071.50 కి లభిస్తుంది. అయితే, గృహ వినియోగ సిలిండర్ల ధరలు మాత్రం యథాతథంగా ఉంటాయి.
Prices of 19 KG Commercial cylinder has been increased by Rs 993 from today. A 19 Kg cylinder will cost Rs 3071.50 in Delhi from today. No change in domestic cylinder prices: Sources
— ANI (@ANI) May 1, 2026
దేశ రాజధాని ఢిల్లీలో, వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధర గతంలో ఉన్న రూ.2078.50 నుండి ఇప్పుడు రూ.3071.50కి పెరిగింది. ఇదిలా ఉండగా, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ రూ.913కే అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి: మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!
హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ధర ఇప్పటి వరకు రూ.2,321 ఉండగా, పెరిగిన ధరల తర్వాత రూ.3,300కుపైగా చేరింది.
ఆర్థిక రాజధాని అయిన ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర గతంలో రూ.2031 ఉండగా, ఇప్పుడు అది రూ.3024కు చేరింది. అదేవిధంగా, కోల్‌కతాలో ధర రూ.3202కు పెరిగింది. దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరమైన చెన్నైలో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. ఇక్కడ వాణిజ్య సిలిండర్లు రూ.3237కు లభిస్తున్నాయి.
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి గణనీయమైన మార్పులు లేకుండా, దాదాపుగా స్థిరంగా ఉండటం ఊరట కలిగించే విషయమే అయినప్పటికీ, పెరుగుతున్న వాణిజ్య సిలిండర్ల ధరలు రాబోయే రోజుల్లో ఆహార ధరలపై ప్రభావం చూపవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
