AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Gold Price Today: ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల స్వీకరణ, అలాగే పెరుగుతున్న ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్న ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగుతోంది. అయితే డాలర్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గుతోంది. అధిక..

Gold Price Today: మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!
Gold Price May1st
Subhash Goud
|

Updated on: May 01, 2026 | 6:45 AM

Share

Gold, Silver Prices: బంగారం, వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గతంలో పరుగులు పెట్టిన ఈ రెండు లోహాల ధరలు ఇప్పుడు భారీ స్థాయిలో దిగి వస్తున్నాయి. రోజురోజుకు భారీ స్థాయిలో దిగి వస్తుండటంతో మహిళలకు ఎంతో ఉపశమనం కలుగుతుందనే చెప్పాలి. గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజుల్లోనే తులం బంగారంపై ఏకకంగా రూ.3 వేల వరకు దిగి వచ్చింది. అదే వెండిపై ఏకంగా రూ.10 వేల వరకు తగ్గింది.

మే 1వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,110 వద్ద కొనసాగుతోంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,000 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర కూడా గత మూడు, నాలుగు రోజుల్లో భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.2,49,000 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,110 వద్ద ఉంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,110 వద్ద ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,820 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,260 వద్ద ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,110 వద్ద ఉంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,110 వద్ద ఉంది.
  6. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,110 వద్ద ఉంది.
  7. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,010 వద్ద ఉంది.

ఇక వెండి ధర విషయానికొస్తే..

హైదరాబాద్‌, చెన్నై, కేరళలో భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతుండగా, ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో రూ.2,49,900 వద్ద కొనసాగుతోంది.

ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల స్వీకరణ, అలాగే పెరుగుతున్న ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్న ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగుతోంది. అయితే డాలర్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గుతోంది. అధిక చమురు ధరలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానంపై కఠిన వైఖరిని కొనసాగించే అవకాశాన్ని మరింత బలపరుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అధికారుల ఆలోచన చేస్తున్నారు.

పైన పేర్కొన్న ధరలు ప్రాథమిక మార్కెట్ రేట్లు మాత్రమే. మీరు కొనుగోలు చేసేటప్పుడు ఈ ధరలకు అదనంగా జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు (తయారీ కూలి) మరియు ఇతర పన్నులు వర్తిస్తాయి. మీ నగరంలోని స్థానిక జ్యువెలరీ అసోసియేషన్ నిర్ణయాల ప్రకారం ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us