AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahatma Gandhi: మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? నెట్టింట్లో వైరల్‌ అవుతున్న మార్క్ షీట్

Mahatma Gandhi: మహాత్మగాంధీ 10వ తరగతి మార్కుల జాబితా నేటి తరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. కేవలం 90% లేదా 95% మార్కులు రాలేదని కుంగిపోవాల్సిన అవసరం లేదని, జీవితంలో విజయం సాధించడానికి మార్కులు ఒక్కటే కొలమానం కాదని..

Mahatma Gandhi: మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? నెట్టింట్లో వైరల్‌ అవుతున్న మార్క్ షీట్
Mahatma Gandhi
Subhash Goud
|

Updated on: Apr 29, 2026 | 12:24 PM

Share

Mahatma Gandhi: పదో తరగతి ఫలితాలు రాగానే విద్యార్థులు, తల్లిదండ్రులు మార్కుల కోసం ఒత్తిడికి గురవ్వడం మనం చూస్తుంటాం. అయితే ప్రపంచాన్నే ప్రభావితం చేసిన మహాత్మా గాంధీ ఒకప్పుడు సాదాసీదా విద్యార్థి అని మీకు తెలుసా? ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న గాంధీజీ పదో తరగతి మార్కుల జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

మార్కుల వివరాలు:

గాంధీజీ అప్పట్లో బాంబే యూనివర్సిటీ (ప్రస్తుత ముంబై యూనివర్సిటీ) పరిధిలో మెట్రిక్యులేషన్ పరీక్ష రాశారు. ఆ మార్కుల జాబితా ప్రకారం:

మొత్తం మార్కులు: 625 కి గాను ఆయనకు వచ్చింది 247.5 మాత్రమే. అంటే కేవలం 39.6 శాతమే. ఆ ఏడాది పరీక్ష రాసిన వేల మందిలో ఆయన 404వ ర్యాంకు సాధించారు. విశేషమేమిటంటే, ఆ సంవత్సరం కేవలం 799 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 1987లో గాంధీజీ పదో తరగతి పూర్తి చేశారు.

సబ్జెక్టుల వారీగా మార్కులు:

  • ఇంగ్లీష్: 89/200
  • గుజరాతీ: 45.5/100
  • గణితం: 59/175
  • జనరల్ నాలెడ్జ్: 54/150

అతను గణితంలో సాధించిన 59 మార్కులు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ స్కోర్ జాబితాపై చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. “మహాత్మా గాంధీ కూడా గణితంలో బలహీనంగా ఉండేవారు” అని చాలా మంది అంటుండగా, “ఈ మార్కులన్నింటికీ ఎలాంటి ఆధారం లేదు” అని మరికొందరు అంటున్నారు.

సగటు విద్యార్థి నుంచి సత్యాగ్రహి వరకు:

గాంధీజీ తన ఆత్మకథ ‘సత్యశోధన’ (My Experiments with Truth) లో తాను పాఠశాల రోజుల్లో చాలా సాధారణ విద్యార్థిని అని, చదువుపై అంతగా ఆసక్తి ఉండేది కాదని నిజాయితీగా ఒప్పుకున్నారు. కానీ, ఆ తక్కువ మార్కులు ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించకుండా అడ్డుకోలేకపోయాయి. ఆ తర్వాత ఆయన 1888లో ఆయన న్యాయశాస్త్రం అభ్యసించడానికి లండన్ వెళ్లి, న్యాయవాదిగా తిరిగి వచ్చారు. ఆ తర్వాత, ఆయన భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రపంచానికి గొప్ప మార్పును తీసుకువచ్చిన ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు.

నేటి విద్యార్థులకు సందేశం:

ఈ మార్కుల జాబితా నేటి తరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. కేవలం 90% లేదా 95% మార్కులు రాలేదని కుంగిపోవాల్సిన అవసరం లేదని, జీవితంలో విజయం సాధించడానికి మార్కులు ఒక్కటే కొలమానం కాదని గాంధీజీ జీవితం నిరూపిస్తోంది. పట్టుదల, కష్టపడే తత్వం, నిజాయితీ ఉంటే ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన మార్కుల జాబితా గుర్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి: BYD Leopard: పెట్రోల్ లేకుండా 100 కి.మీ, ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీలు.. ఇక ఫార్చ్యూనర్‌కు చుక్కలే..!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? మార్క్ షీట్
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? మార్క్ షీట్
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంతకు తెగించావ్‌రా.. పాపం ఆ సాఫ్ట్‌వేర్..
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంతకు తెగించావ్‌రా.. పాపం ఆ సాఫ్ట్‌వేర్..
గేమింగ్ యాప్ వేదికగా ‘లవ్ జిహాద్’ వల!
గేమింగ్ యాప్ వేదికగా ‘లవ్ జిహాద్’ వల!
ఉడిపి స్టైల్ కొబ్బరి–కొత్తిమీర చట్నీ.. ఇలా చేసి తిన్నారంటే మైమరిచ
ఉడిపి స్టైల్ కొబ్బరి–కొత్తిమీర చట్నీ.. ఇలా చేసి తిన్నారంటే మైమరిచ