Reliance Jio vs Vi: రూ.247 – రూ.249 రీఛార్జ్ ప్లాన్‌లలో ఏది బెస్ట్… చెక్ చేసుకోండి..

Reliance Jio vs Vi: 15, 30, 45, 60, 90, 365 రోజుల చెల్లుబాటుతో అపరిమిత డేటాను ఇచ్చే కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌కి శ్రీకారం చుట్టింది జియో. కొత్తగా ప్రారంభించిన..

Reliance Jio vs Vi: రూ.247 - రూ.249 రీఛార్జ్ ప్లాన్‌లలో ఏది బెస్ట్... చెక్ చేసుకోండి..
Jio
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 16, 2021 | 6:07 AM

Reliance Jio vs Vi: 15, 30, 45, 60, 90, 365 రోజుల చెల్లుబాటుతో అపరిమిత డేటాను ఇచ్చే కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌కి శ్రీకారం చుట్టింది జియో. కొత్తగా ప్రారంభించిన ఈ ప్లాన్స్‌ని.. ఇండిపెండెంట్ ప్లాన్స్ అని పేరు పెట్టింది. ఈ ప్లాన్స్ వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇందులో రోజువారీ డేటా పరిమితి లేదు. అయితే, ప్రస్తుతం ఉన్న ప్లాన్స్ కంటే ఇప్పుడు వచ్చిన ప్లాన్ వల్ల వినియోగదారులు రెండు రోజుల ప్రయోజానాలను కోల్పోవాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే.. ఇవే ధరలతో విఐ(Vi) ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తోంది. ఈ ప్లాన్స్ వల్ల రాత్రిపూట డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది డబుల్ డేటా ప్రయోజనాలతో పాటు వినియోగదారులకు 12 AM నుంచి 6 AM మధ్య అపరిమిత హై-స్పీడ్ నైట్‌టైమ్ డేటాను అందిస్తుంది. మరి ఈ రెండు ప్లాన్స్ మధ్య తేడాలు, ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం..

జియో రూ. 247 ప్రీపెయిడ్ ప్లాన్: జియో ప్రకటించిన కొత్త ప్లాన్‌లలో రూ .247 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఇది 25 జీబీ డేటాను 30 రోజుల వ్యాలిడిటీతో, అపరిమిత కాల్స్, జియో యాప్‌లకు యాక్సెస్‌తో అందిస్తుంది.

జియో రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్: జియోలో రెగ్యులర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 249 ఉంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడీని కలిగి ఉంది. రోజుకు 2 జిబి డేటా లభిస్తుంది. అంటే మొత్తం డేటా 56 జిబి. ఈ ప్లాన్ అపరిమిత దేశీయ వాయిస్ కాల్స్, జియో యాప్స్ యాక్సెస్‌తో పాటు.. 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు అందిస్తోంది.

మీరు పైన పేర్కొన్న ప్రణాళికలను పోల్చినట్లయితే, మీరు రెండు ప్రణాళికల మధ్య భారీ డేటా వ్యత్యాసాన్ని చూడవచ్చు. రూ. 249, రూ. 247 మధ్య వ్యత్యాసం 2 రూపాయలే. ఈ రెండు రూపాయల తేడా.. రెండు రోజుల వ్యాలిడిటీ, డబుల్ డేటా. 247 రూపాయలతో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తే.. 2 రూపాయలు అదనంగా పెడితే అంటే 249 తో డబుల్ డేటా లభిస్తుంది. వినియోగదారులు డేటా అవసరం అనుకుంటే 249 తీసుకోవడం.. వ్యాలిడిటీ కావాలనుకుంటే.. రూ. 247 ట్రై చేయొచ్చు.

ఇదిలాఉంటే.. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 12 AM నుంచి 6AM మధ్య హై-స్పీడ్ అపరిమిత డేటాను ఇచ్చే రూ .249, రూ .299 ధర గల ప్రీపెయిడ్ ప్లాన్‌లను విఐ ఇస్తుంది. రాత్రిపూట వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ. 249, అంతకంటే ఎక్కువ ధరతో అదనపు ఖర్చు లేకుండా ఎంచుకునే ప్రీపెయిడ్ వినియోగదారులకు వర్తిస్తాయి.

విఐ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్: విఐ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1.5 జీబీ అందిస్తోంది. అలాగే అన్ని నెట్‌వర్క్‌లకు లోకల్ అండ్ నేషన్ అపరిమిత కాల్స్ అందిస్తోంది. ఈ ప్లాన్ రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల తో పాటు.. 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. ఈ ప్లాన్ వారాంతపు రోల్‌ఓవర్ ప్రయోజనాలను, విఐ మూవీస్, టీవీలకు యాక్సెస్ కూడా ఇస్తోంది. ఈ ప్లాన్ వల్ల మరో ప్రయోజనం ఏంటంటే.. ఎంపిఎల్‌లో ఆడటానికి రూ .125 భరోసా బోనస్ మనీ, జోమాటో, వి మూవీస్ & టివి యాక్సెస్, ఫుడ్ ఆర్డర్‌లపై రోజూ రూ .75 తగ్గింపు ఇస్తోంది. ఈ ప్రణాళికలో ఇటీవల ప్రారంభించిన వారాంతపు రోల్‌ఓవర్ ప్రయోజనం ఒక సంవత్సరానికి ఉంటుంది. ఇది వీకెండ్ ఛాలెంజ్‌కి 50 శాతం ఆఫ్, మై 11 సర్కిల్‌లో 50 శాతం బోనస్ నగదును కూడా ఇస్తుంది.

విఐ రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్: 50 రూపాయల తేడాతో విఐ మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇది డబుల్ డేటా ప్లాన్. 2 ప్లస్ 2 చొప్పున రోజుకు 4 జీబీ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఆ లెక్కన వినియోగదారుడికి మొత్తం 112 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత లోకల్ అండ్ ఇంటర్నేషనల్ కాల్స్ పూర్తి ఉచితంగా అందిస్తోంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఇస్తోంది. విఐ ఇటీవల డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాన్ని తీసుకువచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రాత్రిపూట అపరిమిత డేటా కూడా ఇస్తోంది. ఈ ప్లాన్స్ అన్నింటిలోనూ రూ .299 వి ప్రీపెయిడ్ ప్లాన్ బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇది హై-స్పీడ్ నైట్‌టైమ్ డేటా, వారాంతపు రోల్‌ఓవర్ డేటా ప్రయోజనాలతో పాటు.. 4 జిబి రోజువారీ డేటాను ఇస్తోంది.

Also read:

Rashmika: చిన్న ప‌నుల‌ను చెంత‌కు రానివ్వ‌నంటోన్న ర‌ష్మిక‌.. ఇంత‌కీ ముద్దుగుమ్మ‌ చేసిన ట్వీట్ అర్థ‌మేంట‌బ్బా..?