Reliance Jio: రిలయన్స్ జియో బాండ్లు విక్రయించబోతుందా.. ?
దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోసారి బాండ్ల విక్రయాలు జరిపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోసారి బాండ్ల విక్రయాలు జరిపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రూ.5 వేల కోట్ల విలువైన రూపీ బాండ్లను విక్రయించాడానికి ఆ సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ బాండ్ల మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు కాగా.. వీటిపై 6.20శాతం విలువైన కూపన్స్ ఇవ్వనున్నట్లు ఓ పత్రికలో వచ్చింది. ఈ మార్గంలో సమీకరించిన నిధులను చెల్లింపులకు సంబంధించిన రీఫైనాన్సింగ్‌కు వినియోగించనున్నట్లు తెలిసింది.
జియో చివరిసారిగా 2018లో బాండ్లు విక్రయించింది. 2016లో వైర్‌లెస్ టెలికాం మార్కెట్లోకి ప్రవేశించిన జియో చాలా వేగంగా దేశంలో నెంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. ఓ పక్క మార్కెట్లోని అదనపు నగదు ప్రవాహాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకొంటున్న సమయంలో జియో ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఏడాది జియో భారత్‌లో 5జీ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది.
Read Also.. Kia Carens Bookings: కియా నుంచి సరికొత్త కారు.. జనవరి 14 నుంచి బుకింగ్