జియో నుంచి సరికొత్త సేవలు..! గూగుల్, ఫేస్‌బుక్‌ల మద్దతు.. ఇక మిగతా కంపెనీలు దుకాణం సర్దేయ్యాల్సిందేనా..?
Reliance Industries : ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక రంగాల్లో అడుగు పెట్టింది. రిటైల్ రంగం నుంచి టెలికాం రంగం వరకు అన్నిట్లో ప్రవేశించింది.

Reliance Industries : ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక రంగాల్లో అడుగు పెట్టింది. రిటైల్ రంగం నుంచి టెలికాం రంగం వరకు అన్నిట్లో ప్రవేశించింది. ఇప్పుడు మరో రంగంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదిక ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇన్ఫిబీమ్, గూగుల్, ఫేస్‌బుక్‌లతో కలిసి చెల్లింపుల రంగంలోకి చేరడానికి సిద్ధమైంది. రిలయన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చెల్లింపు సంస్థగా తనను తాను నిలబెట్టుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం, రిలయన్స్ వ్యాపార పోర్ట్‌ఫోలియో చమురు, రసాయనాల నుంచి టెలికాం, రిటైల్ రంగాలకు విస్తరించింది.
ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో పేమెంట్స్ బ్యాంకును నడుపుతోంది. ఇప్పుడు తన కొత్త చెల్లింపు సేవను ప్రవేశపెట్టడంతో ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలనుకుంటుంది. రిలయన్స్ ఈ దశ.. వీసా, మాస్టర్ కార్డ్ వంటి పెద్ద కంపెనీలకు పోటీనిచ్చే దశ అని అందురు విశ్వసిస్తున్నారు. అయితే చెల్లింపు సేవను ప్రారంభించడానికి, రిలయన్స్‌కు ఇంకా లైసెన్స్ మాత్రం రాలేదు. రిలయన్స్ సంస్థ దీర్ఘకాలికంగా అనేక పథకాలను లక్ష్యంగా చేసుకుంది. రాబోయే రోజుల్లో ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలో ఇన్ఫిబీమ్‌తో పాటు గూగుల్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. కొత్త సంస్థలో రిలయన్స్ వాటా 40 శాతం వరకు ఉంటుంది. మిగతా మూడు కంపెనీలకు ఇది 20-20 శాతానికి దగ్గరగా వాటాలు పంచుతోంది.
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యాపారం వేగంగా పెరుగుతోంది.. దీంతో రిలయన్స్ రాబోయే రోజుల్లో డిజిటల్ చెల్లింపుల వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 2018 సంవత్సరంలోనే భారతదేశంలో డిజిటల్ ఎకానమీ పరిమాణం దేశ జీడీపీలో 8 శాతానికి చేరుకుంటుందని అంచనా వేశారు. అంటే సుమారు 200 బిలియన్ డాలర్లు. 2025 నాటికి ఇది జీడీపీలో 18-23 శాతానికి పెరుగుతుందని అంచనా. ఈ అంచనా ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఎక్కవగా వస్తుందని నిపుణుల అభిప్రాయం. భారతదేశం ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్‌లో ప్రపంచంలో రెండో దేశంగా మారింది, ఇక్కడ డిజిటల్ సేవలను వేగంగా స్వీకరిస్తున్నారు.
రాబోయే రోజుల్లో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడానికి ఇంకా చాలా కొత్త కంపెనీలు అవసరమని ఆర్‌బిఐ అభిప్రాయపడింది. గత వారం టాటా గ్రూప్, ఐసిఐసిఐ-యాక్సిస్ బ్యాంక్ నేతృత్వంలోని 6 కన్సార్టియం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు జాతీయ చెల్లింపుల మౌలిక సదుపాయాలను సిద్ధం చేయమని ప్రతిపాదన పంపింది. బ్యాంక్ యూనిట్‌కు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ నాయకత్వం వహిస్తాయి. మోప్పే అనే ఈ యూనిట్‌లో రెండు కంపెనీలకు 20-20 శాతం వాటా ఉందని తెలుస్తోంది.