Reliance Industries: డిసెంబర్ త్రైమాసికం ఫలితాల్లో దూసుకెళ్లిన రిలయన్స్..!
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డిసెంబర్ 31, 2021తో ముగిసిన 3వ త్రైమాసికం (3Q FY22) ఫలితాలను విడుదల చేసింది...
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డిసెంబర్ 31, 2021తో ముగిసిన 3వ త్రైమాసికం (3Q FY22) ఫలితాలను విడుదల చేసింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.18,549 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021 ఏడాదిలో క్రితం 3వ త్రైమాసికంలో లాభం కంటే 41 శాతం ఎక్కువ. గత సంవత్సరం ఇదే సమయంలో వచ్చిన చమురు-రిటైల్ టెలికామ్ ఆదాయం రూ.1.23 లక్షల కోట్లతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం ఆదాయం 54 శాతం పెరిగి రూ.1.91 లక్షల కోట్లకు చేరినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
శుక్రవారం రిలయన్స్ ఎ న్‌ఎస్‌ఈలో ఫలితాలకు ముందు రూ.2,476 ధర వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్ గత సంవత్సరం క ఆలంలో 18.26 శాతం పెరిగింది. హెవీవెయిట్ స్టాక్ అసమాన పనితీరుతో 102 కోట్ల మంది కొత్త వినియోగదారులను పొందింది. 2021-22 3వ త్రైమాసికంలో జియో మొత్తం ఆదాయాలు 13.8శాతం పెరిగి రూ.24,174 కోట్లకు చేరుకుందని ఫలితాలు చెబుతున్నాయి. డిసెంబర్ 31 వరకు కంపెనీ వినియోగదారుల సంఖ్య 42.10 కోట్లుగా ఉండగా, డిసెంబర్ త్రైమాసికంలో 1.02 కోట్ల కొత్త వినియోగదారులు చేరారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. అన్ని వ్యాపారాల నుంచి బలమైన సహకారం అందడంతో క్యూ3 ఎఫ్‌వై 22లో అత్యుత్తమ పనితీరు కనబర్చిందని అన్నారు.
ఇవి కూడా చదవండి: