AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. పారా ఒలింపియన్ ఇంటికి చేరిన ఎక్స్‌యూవీ 700 గోల్డ్ ఎడిషన్‌..

ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. స్ఫూర్తినిచ్చే వ్యక్తులను పరిచయం చేయడం.. వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు నడపడంలో

Anand Mahindra: మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. పారా ఒలింపియన్ ఇంటికి చేరిన ఎక్స్‌యూవీ 700 గోల్డ్ ఎడిషన్‌..
Basha Shek
| Edited By: |

Updated on: Jan 22, 2022 | 9:45 AM

Share

ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. స్ఫూర్తినిచ్చే వ్యక్తులను పరిచయం చేయడం.. వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు నడపడంలో ఆయన ఎప్పుడూ సాయపడుతుంటారు.   గతంలో క్రీడాకారులతో పాటు వివిధ రంగాల్లో  సత్తాచాటి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన వారికి మహీంద్రా థార్ కార్లను బహుమతులుగా ఇచ్చారీ బిజినెస్ టైకూన్.  తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఓ క్రీడాకారిణికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గతేడాది జరిగిన టోక్యో పారా ఒలింపిక్స్ లో అవని లేఖరా 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో స్వర్ణ పతకం సాధించింది. అదేవిధంగా  50 మీటర్ల రైఫిల్‌ షూటింగ్‌ విభాగంలో రజత పతకం సొంతం కుని విశ్వ వేదికపై మువ్వన్నెల జెండాని రెపరెపలాడించింది.    ఈ సందర్భంగా అవని లేఖరాను ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా  ఆమె శరీర తత్వానికి వీలుగా సులభంగా ప్రయాణించేందుకు  సరికొత్త మహీంద్రా తయారుచేసిస్తానంటూ ప్రకటించారు.   ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు.

దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా..

ఆనంద్‌ మహీంద్రా  అలా మాట ఇచ్చారో లేదా ప్రత్యేక వాహనం తయారీ పనులు  వెనువెంటనే జరిగిపోయాయి. మహీంద్రా గ్రూపు చీఫ్‌ డిజైనర్‌ ప్రతాప్‌ బోస్‌ ఆధ్వర్యంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడల్‌లో పలు మార్పులు చేశారు. ఇందులో భాగంగా డ్రైవర్‌ సీటు పక్కన ఉండే కో డ్రైవర్‌ సీటు బయటకి వచ్చేలా ఏర్పాటు చేశారు. దీని వల్ల దివ్యాంగులు సులభంగా కారులోకి ఎక్కడం, దిగడం చేయవచ్చు. కాగా దివ్యాంగులకు ఉండే ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసిన ఈ కారును ఇటీవల అవని లేఖరాకు  అందించారు ఆనంద్ మహీంద్రా. ఈ సందర్భంగా తనకు బహుమతిగా వచ్చిన కారుని చూసిన పారా ఒలింపియన్  మురిసిపోయింది. ‘థ్యాంక్యూ  ఆనంద్‌ మహీంద్రా అండ్‌ టీమ్‌’ అంటూ తాను కారులో కూర్చున్న ఫోటోలను సోషల్ మీడియాల పోస్ట్ చేసింది. దీంతో ఇవి కాస్తా వైరల్ గా మారాయి.

అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో..

కాగా ఎక్స్ యూవీ 700 గోల్డ్ ఎడిషన్ కార్లను గతంలో పలువురికి బహుమతిగా అందించారు ఆనంద్ మహీంద్రా. ఇందులో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లుంటాయి. మొత్తం 7 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్,  ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ కీస్ అసిస్ట్,  ఆటో హెడ్ లైట్ బూస్టర్ తదితర అత్యాధునిక సదుపాయాలుంటాయి.<

Also Read: IND VS SA: రెండో వన్డేలోనూ చతికిలపడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..

Dolo 650: అంద‌రి త‌ల నొప్పిని త‌గ్గించే డోలో 650.. కంపెనీ వారి త‌ల‌రాత‌ను మార్చేసింది.. కాసుల వ‌ర్షం..

Video Viral: న్యాయమూర్తి ఛాంబర్‌లో పాము కలకలం.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Follow Us
బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి