Diamonds Price: పండుగకు ముందే భారీగా తగ్గిన వజ్రాల ధరలు.. కారణం మాత్రం అదే..

ప్రపంచ వ్యాప్తంగా వజ్రాల వ్యాపారంలో భారత్‌దే ఆధిపత్యం. ప్రపంచంలో ఉపయోగించే 10 వజ్రాలలో తొమ్మిది మన దేశంలోనే ప్రాసెస్ చేయబడుతాయి. ఎక్కువగా గుజరాత్‌లోని సూరత్‌ మార్కెట్ నుంచే ప్రపంచ విపణిలోకి వస్తాయి. ఈ నగరం నుంచే 7,000 కంటే ఎక్కువ మధ్యస్థ, చిన్న, కొన్ని పెద్ద యూనిట్లు ఉన్నాయి. ఇందులో వజ్రాలను కట్ చేసి, పాలిష్ చేసినవి..

Diamonds Price: పండుగకు ముందే భారీగా తగ్గిన వజ్రాల ధరలు.. కారణం మాత్రం అదే..
Diamond
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 02, 2023 | 6:12 PM

ఈ ఏడాది వజ్రాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎందుకంటే మహమ్మారి తర్వాత చాలా మంది వినియోగదారులు కాస్మెటిక్ వస్తువులకు దూరమవుతున్నారు. ఈ సమాచారం బిజినెస్ మీడియా అందించింది. జిమ్నిస్కీ గ్లోబల్ రఫ్ డైమండ్ ఇండెక్స్ ప్రకారం, ధరలు ఏడాదిలో అత్యల్పంగా ఉన్నాయి. CNN నివేదిక ప్రకారం, ఆభరణాల అమ్మకాలు క్షీణించడమే ఈ మందగమనానికి కారణమని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.

గ్లోబల్ డైమండ్ అనలిస్ట్ పాల్ జిమ్నిస్కీ కొంత వివరంగా తెలిపారు. వినియోగదారులు ఆభరణాల కంటే సేవలను ఎంచుకోవడం వల్ల వజ్రాల ధరలు పడిపోయాయని చెప్పారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. కొవిడ్ తరువాత, ప్రజలు ఇప్పుడు బయట భోజనం, ప్రయాణాలు చేస్తున్నారు. లగ్జరీ వస్తువులకు బదులుగా అవసరాల కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారు. వజ్రాలు పూర్తిగా వినియోగదారుల ఆధారిత మార్కెట్ అని బిజినెస్ విశ్లేషకులు అభిప్రయాపడుతున్నారు.

గత ఏడాది వజ్రాలకు గిరాకీ..

వజ్రాల విక్రయాలలో రెండేళ్ళ రికార్డు బద్దలు కొట్టిన తర్వాత ధరలు తగ్గుముఖం పట్టాయి. సహజ వజ్రాభరణాలకు డిమాండ్ 2021- 2022లో అత్యధిక స్థాయిలో ఉంది. 2024 ప్రారంభంలో రిటైల్ అమ్మకాలు పెరుగుతాయని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న నెలల్లో వజ్రాల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ కంపెనీ డీ బీర్స్ ప్రతినిధి డేవిడ్ జాన్సన్ అంచనా వేశారు.

10 వజ్రాలలో తొమ్మిది మనవే..

ప్రపంచ వ్యాప్తంగా వజ్రాల వ్యాపారంలో భారత్‌దే ఆధిపత్యం. ప్రపంచంలో ఉపయోగించే 10 వజ్రాలలో తొమ్మిది మన దేశంలోనే ప్రాసెస్ చేయబడుతాయి. ఎక్కువగా గుజరాత్‌లోని సూరత్‌ మార్కెట్ నుంచే ప్రపంచ విపణిలోకి వస్తాయి. ఈ నగరం నుంచే 7,000 కంటే ఎక్కువ మధ్యస్థ, చిన్న, కొన్ని పెద్ద యూనిట్లు ఉన్నాయి. ఇందులో వజ్రాలను కత్తిరించి, పాలిష్ చేసే పనిల 8 లక్షల మంది నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారు. 2022-23లో భారతదేశం 23.73 బిలియన్ డాలర్ల విలువైన ప్రాసెస్డ్ డైమండ్స్ ఎగుమతి చేసింది. కానీ గనిలో వజ్రాల నిల్వలు లేకుండా.. పరిశ్రమ తన వజ్రాల అవసరాలన్నింటినీ దిగుమతి చేసుకుంటుంది. 2022-23లో భారతదేశ వజ్రాల దిగుమతులు $17.37 బిలియన్లకు చేరుకున్నాయి.

అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్‌..

జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు ఓ ప్రత్యేక బహుమతిని అందించారు. ఇది 7.5-క్యారెట్ డైమండ్, ఒక సున్నితమైన కశ్మీరీ పేపియర్-మాచే బాక్స్‌లో చక్కగా ప్యాక్ చేయబడింది. ఇది భూమి నుంచి లభించిన వజ్రం కాదు.. ఇది సహజ వజ్రాం.. సూరత్‌లోని ఒక ప్రయోగశాలలో ప్రత్యేకంగా తయారు చేసింది. ఎంతో ఆకర్శనీయంగా కళాకారులు చక్కగా తయారు చేసిన ‘గ్రీన్’ డైమండ్ అది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి