AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EMI Interest Rates: రెపో రేటు విషయంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆ రుణాలపై ఈఎంఐల తగ్గింపు.?

ఇటీవల కాలంలో పెరిగిన ఖర్చుల నేపథ్యంలో అప్పులు తీసుకోవడం అనేది పరిపాటిగా మారింది. అయితే నెలవారీ ఆదాయం వచ్చే ఉద్యోగులు అప్పుల చెల్లింపులకు ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఆర్‌బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

EMI Interest Rates: రెపో రేటు విషయంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆ రుణాలపై ఈఎంఐల తగ్గింపు.?
Emi
Nikhil
|

Updated on: Feb 13, 2025 | 3:00 PM

Share

గత వారం ఆర్‌బీఐ ఎంపీసీ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో రుణాలు పొందిన వారికి ఉపశమనం లభించనుంది. రెపో రేటు తగ్గింపుతో ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఆధారిత గృహ రుణాలు, ఆటోమొబైల్ రుణాలు లేదా వ్యక్తిగత రుణాలకు రుణ ఈఎంఐ మొత్తం తగ్గింపు లేదా ఈఎంఐ వ్యవధిలో తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొత్తగా రుణాలు తీసుకునే వారికి కొన్ని వారాల తర్వాత రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు.  రెపో రేటు అనేది అవుటర్ బెంచ్‌మార్క్‌లతో అనుసంధానించి ఉన్న రుణాలపై వడ్డీ రేట్లు వెంటనే తగ్గుతాయి. దాదాపు ఒక నెలలోపు ఈ రుణాలపై ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. అయితే ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణాలు ఈఎంఐలు తగ్గింపులను పొందేందుకు కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు తర్వాత ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ వివరాలు వెల్లడించారు. అలాగే ప్రస్తుత డిపాజిట్లు కాంట్రాక్ట్ రేటుకు అనుగుణంగా కొనసాగుతాయని, కొత్త డిపాజిట్లలో మాత్రమే మార్పులు కనిపిస్తాయని వివరించారు.  ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణాలు బ్యాంకు నిధుల ఖర్చు, డిపాజిట్ రేట్లు, నిర్వహణ ఖర్చుల ద్వారా ప్రభావితమవుతాయి. అందువల్ల ట్రాన్స్మిషన్ ప్రక్రియ నెమ్మదిస్తుంది. అలాగే ఈ రుణాలు సాధారణంగా ఆరు నెలల రీసెట్ వ్యవధిని కలిగి ఉంటాయి. అంటే సవరించిన రేట్లు వచ్చే ఏడాది మాత్రమే అమలులోకి వస్తాయి. అయితే ఏదైనా రుణం తీసుకునే సమయంలో ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఆధారిత రుణాల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే రెపో రేటు తగ్గింపు వంటి సందర్భాల్లో నెలవారీ కట్టే ఈఎంఐ తగ్గుతుంది. అయితే ఫిక్స్‌డ్ ఇంట్రస్ట్ రేటుతో తీసుకున్న రుణాలపై ఈఎంఐ చెల్లింపుల్లో ఎలాంటి మార్పు ఉండదు.

చాలా బ్యాంకులు రుణగ్రహీతలకు బేస్ రేటు-లింక్డ్ రుణాల నుంచి ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణాలకు మారే అవకాశాన్ని కూడా అందిస్తాయి. చాలా రుణాలు ఇప్పటికే రెపో రేటు విధానానికి మార్చారని, పాత బెంచ్‌మార్క్ (ఆధారంగా ఉన్న రుణాలు చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో అంటే మే 2020 తర్వాత ఆర్‌బీఐ వడ్డీ రేటు తగ్గించడం ఇదే మొదటిసారి. తాజా తగ్గింపు తర్వాత రెపో రేటు 6.25 శాతంగా ఉంది. ఇది గతంలో 6.50 శాతంగా ఉంది. మే 2020-ఏప్రిల్ 2022 మధ్య ఆర్‌బీఐ రెపో రేటును 4 శాతం వద్దనే మార్చలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 2022 నుంచి పాలసీ రేట్లను పెంచడం ప్రారంభించింది. దీంతో ఫిబ్రవరి 2023 వరకు క్రమంగా 6.5 శాతానికి పెంచింది. ఆ తర్వాత రెండేళ్లపాటు దానిని మార్చకుండానే కొనసాగించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి