Anil Ravipudi: అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్
ప్యాన్ ఇండియా జపంలో ఉన్న మన దర్శకులకు అనిల్ రావిపూడి రీజినల్ సినిమా సత్తా ఏంటో చూపిస్తున్నారు. వారం రోజుల్లో 292 కోట్లతో రికార్డులు సృష్టిస్తూ, తెలుగు బాక్సాఫీస్ బలాన్ని చాటారు. భారీ బడ్జెట్‌లు, ఎక్కువ రోజులు అక్కర్లేకుండానే సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టి, మన మార్కెట్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని అనిల్ గుర్తుచేస్తున్నారు. రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమాను చూపిస్తే, అనిల్ మనకు మన సత్తాను తెలియజేస్తున్నారు.
ప్యాన్ ఇండియా అంటూ రీజినల్ మార్కెట్‌లో ఉన్న సత్తాను మన దర్శకులు మరిచిపోతున్నారు. ఒకేసారి అన్ని ఇండస్ట్రీల్లో పాగా వేయాలని కలలు కంటూ.. బంగారు బాతు లాంటి తెలుగు మార్కెట్ వదిలేస్తున్నారు. సరిగ్గా అక్కడే అనిల్ రావిపూడి తన సత్తా చూపిస్తున్నారు. బాక్సాఫీస్‌కు రీజినల్ పవర్ ఏంటో చూపిస్తున్నారీయన. వారం రోజుల్లో 292 కోట్ల గ్రాస్.. 141 కోట్ల షేర్.. రీజినల్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్.. ప్యాన్ ఇండియన్ సినిమాలకు కూడా సాధ్యం కాని కలెక్షన్స్.. ఇవన్నీ కేవలం ఒకే వారంలో చేసి చూపించారు మన శంకరవరప్రసాద్ గారు. ఓవర్సీస్‌లోనూ 3 మిలియన్ మార్క్ అందుకుని తగ్గేదే లే అంటూ రప్ఫాడిస్తున్నాడు బాస్. రీజినల్ సినిమాల్లో అందనంత ఎత్తులో ఉంది శంకరవరప్రసాద్ గారు. శంకరవరప్రసాద్ సక్సెస్ క్రెడిట్‌లో సగం అనిల్ రావిపూడికి వెళ్తుంది. రీజినల్ సినిమాకు ఇంత సత్తా ఉందని మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారీయన. అంతా ప్యాన్ ఇండియా జపం చేస్తున్న సమయంలో సంక్రాంతికి వస్తున్నాంతో వెంకీ లాంటి సీనియర్ హీరోను పెట్టి.. 300 కోట్లు కొట్టి చూపించారు అనిల్. ఏకంగా అల వైకుంఠపురములో రికార్డుల్నే కొల్లగొట్టింది ఈ చిత్రం. అనుకుంటే ప్యాన్ ఇండియన్ సినిమా చేయడం అనిల్ రావిపూడికి చాలా ఈజీ.. ఆయన ఓకే అంటే హీరోలు డేట్స్ ఇస్తారు, నిర్మాతలు క్యూ కడతారు. కానీ పక్కా ప్లానింగ్‌తో పండక్కి మన తెలుగు సినిమా చూపిస్తూ కలెక్షన్స్‌తో రికార్డులు తిరగరాస్తున్నారు ఈ దర్శకుడు. ఓవైపు రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపిస్తే.. అనిల్ మన సినిమా సత్తా మనకే మళ్లీ పరిచయం చేస్తున్నారు. పెద్దగా బడ్జెట్స్ ఉండవు.. వందల రోజుల వర్కింగ్ డేస్ అక్కర్లేదు.. పెద్ద పెద్ద సెట్లతో పనిలేదు.. సింపుల్ కథలతో సంక్రాంతికి వస్తాడు.. హిట్ కొడతాడు.. రిపీట్ అన్నట్లుంది అనిల్ ట్రాక్ రికార్డ్. 2027 సంక్రాంతికి వెంకీ మామతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రీజినల్ సినిమాలతో ప్యాన్ ఇండియా రికార్డుల్ని పరుగులు పెట్టిస్తున్నారు అనిల్ రావిపూడి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే
Prabhas: ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే
Varun Tej: వరుణ్ తేజ్ పరిస్థితి ఏంటి.. కనకరాజు కరుణిస్తాడా..?
Keerthy Suresh: మరోసారి బాలీవుడ్ వైపు చూస్తున్న కీర్తి సురేష్.. అంతలా ఏముంది అక్కడ
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

