AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Policy Review: ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

ఇప్పుడు ఆర్థిక నిపుణులు, పెట్టుబడిదారుల చూపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంపైనే ఉంది. ఈ కమిటీ భేటీ నేడు ప్రారంభం కానుంది.

RBI Policy Review: ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Srinivas Chekkilla
|

Updated on: Feb 08, 2022 | 7:09 AM

Share

ఇప్పుడు ఆర్థిక నిపుణులు, పెట్టుబడిదారుల చూపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంపైనే ఉంది. ఈ కమిటీ భేటీ నేడు ప్రారంభం కానుంది. అయితే 7న ప్రారంభమయ్యే ఈ సమావేశం లతా మంగేష్కర్(Lata Mangeshkar) మరణంతో నేటికి వాయిదా పడింది. ఆర్‌బీఐ ఈ సమావేశ అనంతరం 10న నిర్ణయాలు ప్రకటించనుంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులన్నీ కీలక వడ్డీరేట్లు పెంచే పనిలో పడ్డాయి. ఇప్పుడు ఆర్‌బీఐ కూడా అదే బాటలో పయనిస్తుందా? లేక దేశీయ పరిస్థితులకు అనుగుణంగా భిన్నమైన నిర్ణయం తీసుకుంటుందా? ఈ సమావేశంలో తేలనుంది.

ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కీలక రేట్లను మరికొన్ని నెలల పాటు యథాతథంగా కొనసాగించొచ్చనన్నది తెలుస్తుంది. కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఒమిక్రాన్‌ రూపంలో కాస్త బ్రేకులు పడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు మరీ దిగజారిన పరిస్థితులైతే లేవని నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ద్రవ్యోల్బణం కాస్త అదుపులోనే ఉందని చెప్పొచ్చు! అదే సమయంలో ముడి చమురు ధరలు పెరుగుతుండడం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో రేట్ల పెంపునకు ఆర్‌బీఐకి మరికొంత సమయం అందుబాటులో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బడ్జెట్‌లో భారీ ఉద్దీపనలేవీ ప్రకటించని కారణంగా ఇప్పుడే రేట్లను పెంచడం వల్ల స్టాక్‌ మార్కెట్లు భారీ కుదుపునకు లోనయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరిలో కాకుండా.. ఏప్రిల్‌ లేదా జూన్‌ వరకు ఆర్‌బీఐ రేట్ల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం 1982 నాటి గరిష్ఠానికి చేరుకుంది. దీంతో అక్కడ రేట్ల పెంపు అనివార్యమైంది. మరోవైపు బ్రెజిల్‌ వంటి వర్ధమాన దేశాలు కూడా ఇప్పటికే రేట్ల పెంచేందుకు నిర్ణయించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో గత రెండేళ్లుగా రెపో రేటును ఆర్‌బీఐ 4 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తుంది.

Read Also.. Silver Rate Today: వెండి కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన సిల్వర్‌ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో..