AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. ఇక కిరాణ షాపుల్లోనూ బ్యాంకు అకౌంట్‌ కేవైసీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!

RBI New Rules: బ్యాంకింగ్ కరస్పాండెంట్లు (BC) అంటే బ్యాంకు తన ఏజెంట్లుగా నియమించుకునే వ్యక్తులు లేదా సంస్థలు. ఈ వ్యక్తులు బ్యాంకు శాఖలు లేని లేదా చాలా తక్కువ బ్యాంకు శాఖలు లేని ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. ఉదాహరణకు, మీ..

RBI: బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. ఇక కిరాణ షాపుల్లోనూ బ్యాంకు అకౌంట్‌ కేవైసీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!
Subhash Goud
|

Updated on: Jun 15, 2025 | 10:43 AM

Share

బ్యాంక్ ఖాతాల కేవైసీ అప్‌డేట్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక పెద్ద అడుగు వేసింది. ఇప్పుడు మీ కేవైసీ అప్‌డేట్ చేసుకోవడం మరింత సులభతరం అయింది. ఆర్బీఐ జూన్ 12, 2025న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో కేవైసీ అప్‌డేట్ రెండు విధానాలను మార్చింది.

మొదట ఇప్పుడు బ్యాంకింగ్ కరస్పాండెంట్లు (BC) అంటే మీ ప్రాంతంలోని కిరాణా దుకాణం యజమాని వంటి బ్యాంకు ఏజెంట్లు లేదా NGO, SHG, MFI వంటి సంస్థలు కూడా కేవైసీని అప్‌డేట్‌ చేస్తాయి. అక్కడికి వెళ్లి మీరు ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు.

రెండవది బ్యాంకులు ఇప్పుడు కేవైసీ అప్‌డేట్ కోసం కనీసం మూడుసార్లు కస్టమర్లకు ముందుగానే తెలియజేయాలి. అందులో ఒకసారి లేఖ ద్వారా కూడా ఉంటుంది. కేవైసీ అప్‌డేట్ పొందడంలో సమస్యలను ఎదుర్కొనే వారికి ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ మార్పు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.

బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఎవరు?

బ్యాంకింగ్ కరస్పాండెంట్లు (BC) అంటే బ్యాంకు తన ఏజెంట్లుగా నియమించుకునే వ్యక్తులు లేదా సంస్థలు. ఈ వ్యక్తులు బ్యాంకు శాఖలు లేని లేదా చాలా తక్కువ బ్యాంకు శాఖలు లేని ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. ఉదాహరణకు, మీ వీధిలోని కిరాణా దుకాణం యజమాని, NGO, స్వయం సహాయక బృందం (SHG), మైక్రో ఫైనాన్స్ సంస్థ (MFI) లేదా ఇతర పౌర సమాజ సంస్థ (CSO) కూడా బ్యాంకు నుండి అనుమతి పొందినట్లయితే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు కావచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, బిజినెస్ కరస్పాండెంట్ అనేది బ్యాంకు శాఖ విస్తరించిన విభాగం. ఇది బ్యాంకింగ్ సౌకర్యాలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలను అందిస్తుంది. అంటే ఇప్పుడు మీరు మీ ప్రాంతంలోని కిరాణా దుకాణదారుడి నుండి మీ కేవైసీని అప్‌డే్‌ చేసుకోవచ్చు.

కేవైసీ అప్‌డేషన్‌లో ఆర్బీఐ ఏం మార్చింది?

కేవైసీ అప్‌డేటింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి రిజర్వ్‌ బ్యాంకు రెండు ప్రధాన మార్పులను చేసింది.

బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఇప్పుడు KYC ని అప్‌డేట్ చేస్తారు.

ఇప్పుడు మీ KYC వివరాలలో ఏదైనా మార్పు చేయవలసి ఉంటే, మీరు బ్యాంకు అధీకృత బ్యాంకింగ్ కరస్పాండెంట్లు (బీసీ) ద్వారా స్వీయ-ప్రకటనను ఇవ్వవచ్చు. ఈ స్వీయ-ప్రకటన ఇప్పుడు బ్యాంకు వ్యవస్థలో ఎలక్ట్రానిక్ రూపంలో నమోదు చేస్తారు.

ఇది ఎలా జరుగుతుంది?

1.మీరు బీసీలో బయోమెట్రిక్ ఆధారిత e-KYC ప్రామాణీకరణ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది.

2. ఎలక్ట్రానిక్ మోడ్ అందుబాటులో లేకపోతే, మీరు భౌతిక రూపంలో స్వీయ-ప్రకటన ఇవ్వవచ్చు.

3. బీసీ ఈ డిక్లరేషన్, అవసరమైన పత్రాలను వీలైనంత త్వరగా బ్యాంకు శాఖకు పంపాలి. డిక్లరేషన్ లేదా పత్రాలను సమర్పించినందుకు బీసీ మీకు రసీదు ఇస్తుంది.

4. బ్యాంక్ మీ కేవైసీ రికార్డులను అప్‌డేట్ చేస్తుంది. రికార్డులు అప్‌డేట్‌ అయ్యాయని మీకు తెలియజేస్తుంది.

5. కేవైసీ అప్‌డేషన్ మొత్తం బాధ్యత బ్యాంకింగ్ కరస్పాండెంట్లు (BC)పై కాదని.. బ్యాంకుపై ఉంటుందని గమనించడం ముఖ్యం.

కేవైసీ అప్‌డేట్ కోసం మీకు ముందుగానే సమాచారం:

KYC అప్‌డేట్ కోసం కనీసం మూడుసార్లు ముందుగానే కస్టమర్లకు తెలియజేయాలని RBI బ్యాంకులను కఠినంగా ఆదేశించింది. ఇందులో, ఒకసారి లేఖ ద్వారా సమాచారం ఇవ్వడం తప్పనిసరి.

ప్రక్రియ ఎలా ఉంటుంది?

1.KYC అప్‌డేట్ గడువు తేదీకి ముందు బ్యాంకు కనీసం మూడుసార్లు కస్టమర్లకు గుర్తు చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని ఇమెయిల్, SMS లేదా అందుబాటులో ఉన్న ఇతర పద్ధతుల ద్వారా ఇవ్వవచ్చు. కానీ ఒక లేఖను ఒకసారి పంపాలి.

2. గడువు తేదీ తర్వాత కూడా కేవైసీ అప్‌డేట్‌ చేయకపోతే బ్యాంక్ కనీసం మూడుసార్లు రిమైండర్ పంపవలసి ఉంటుంది. అందులో మరోసారి లేఖ కూడా ఉంటుంది.

3. ఈ లేఖలలో KYC ని ఎలా అప్‌డేట్ చేయాలి? సహాయం కోసం ఎలా సంప్రదించాలి? KYC అప్‌డేట్ చేయకపోతే తలెత్తే సమస్యల గురించి సులభమైన సమాచారం ఉంటుంది.

4. బ్యాంకులు ఈ సమాచారం, రిమైండర్‌ల రికార్డును తమ వ్యవస్థలో ఉంచుకోవాలి. తద్వారా అది ఆడిట్ సమయంలో చూపిస్తారు.

జనవరి 1, 2026 నాటికి అమలు

ఈ నిబంధన ఎందుకు?

చాలా మంది ప్రజలు KYC ని సకాలంలో అప్‌డేట్ చేయలేకపోతున్నందున RBI ఈ చర్య తీసుకుంది. దీని కారణంగా వారి బ్యాంకింగ్ సేవలు అంతరాయం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT), ఎలక్ట్రానిక్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (EBT), స్కాలర్‌షిప్, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) కింద తెరిచిన ఖాతాలలో కేవైసీ అప్‌డేట్‌లు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. దీని కారణంగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

DBT, EBT, స్కాలర్‌షిప్, PMJDY ఖాతాలలో కేవైసీ అప్‌డేట్‌లు భారీ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని గమనించినట్లు ఆర్బీఐ తెలిపింది. అందుకే ఆర్బీఐ బ్యాంకులు, ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ శాఖలలో కేవైసీ అప్‌డేట్‌ల కోసం శిబిరాలను నిర్వహించాలని, ప్రత్యేక ప్రచారాలను నిర్వహించాలని సూచించింది. అలాగే, అటువంటి ఖాతాలను సక్రియం చేయడంలో సానుభూతి వైఖరిని అవలంబించాలని బ్యాంకులను కోరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి