AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI MPC: సామాన్య ప్రజలకు షాకిచ్చిన ఆర్బీఐ.. కీలక నిర్ణయం

RBI MPC: ఈ రోజు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మానిటరింగ్‌ పాలసీ కమిటి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిమి జరగలేదు. దీంతో సామాన్య ప్రజలకు షాకిచ్చినట్లయ్యింది. ఈ సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది..

RBI MPC: సామాన్య ప్రజలకు షాకిచ్చిన ఆర్బీఐ.. కీలక నిర్ణయం
Subhash Goud
|

Updated on: Oct 01, 2025 | 10:27 AM

Share

RBI MPC:  ప్రజలకు పెద్ద షాక్ ఇస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన MPC సమావేశంలో వరుసగా రెండవసారి తన పాలసీ రేటును తగ్గించకూడదని నిర్ణయించింది. ఆరుగురు ఆర్బీఐ సభ్యులలో ఐదుగురు రెపో రేటును తగ్గించడానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 5.50 శాతంగా ఉంది. గతంలో ఆగస్టులో కూడా తన పాలసీ రేటును మార్చలేదు ఆర్బీఐ. రెపో రేటులో 0.25 శాతం తగ్గింపుతో అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చాలా మంది ఆర్థికవేత్తలు ఊహించారు. అయితే, అది జరగలేదు.

New Rules: అక్టోబర్‌ 1 నుంచి కొత్త రూల్స్.. మీ జేబు జర భద్రం

ద్రవ్యోల్బణం, సుంకాల కారణంగా వృద్ధి తగ్గే అవకాశం ఉండటంతో సహా అనేక కారణాలు RBI ఎదుర్కొంది. ఇది రెపో రేటు కోతకు దారితీసి ఉండవచ్చు. అయితే రెపో రేటును తగ్గించకూడదనే నిర్ణయం వ్యూహాత్మకమైనదని నిపుణులు అంటున్నారు. దీనికి ఒక కారణం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రేటు కోత వల్ల ఎటువంటి వృద్ధి ప్రయోజనాలు కనిపించడం లేదు. ఆర్బీఐ గవర్నర్ ప్రసంగం డిసెంబర్‌లో రేటు కోతను సూచించింది. RBI MPC ఈ సంవత్సరం ఇప్పటికే రెపో రేటును 1% తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపులు చేయగా, జూన్‌లో 50 బేసిస్ పాయింట్ల రేటు కోత జరిగింది.

ఇవి కూడా చదవండి

రెపో రేటు అంటే ఏమిటి?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని వాణిజ్య బ్యాంకులకు రుణాలను అందిస్తుంది. దానిని రెపో రేటు అంటారు. రెపో రేటు పెరిగినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు ఖరీదైన రుణాలను ఇస్తుంది. బ్యాంకులు రుణ భారాన్ని ఖాతాదారులపై మోపుతాయి. గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. ద్రవ్యోల్బణ రుణాలను తగ్గించేందుకు ఆర్‌బిఐ మార్కెట్లో లిక్విడిటీని తగ్గిస్తుంది. ఇందుకోసం రెపో రేటును పెంచింది.

రివర్స్ రెపో రేటు:

ఆర్బీఐ ఈ రకమైన రివర్స్ రెపో రేటు కింద వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుంది. అంటే ఈ బ్యాంకులు ఆర్బీఐ వద్ద డబ్బును డిపాజిట్ చేస్తాయి. ఆర్‌బీఐ దానిపై వడ్డీ చెల్లిస్తుంది. గత కొద్ది రోజులుగా రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఈ రేటు 3.35 శాతంగా ఉంది.

ఇది కూడా చదవండి: RBI: సామాన్యులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1 నుంచి అమలు!

ఇది కూడా చదవండి: LPG Gas: దసరాకు ముందు షాకిచ్చిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంత పెరిగిందంటే..

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం