UPI123Pay: ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. ఇంటర్నెట్‌ లేని ఫీచర్‌ ఫోన్‌ల నుంచి యూపీఐ సేవలు

UPI123Pay: బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఇంటర్‌నెట్‌ సదుపాయం లేని ఫీచర్స్‌ ఫోన్ల నుంచి..

UPI123Pay: ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. ఇంటర్నెట్‌ లేని ఫీచర్‌ ఫోన్‌ల నుంచి యూపీఐ సేవలు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 08, 2022 | 3:32 PM

UPI123Pay: బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఇంటర్‌నెట్‌ సదుపాయం లేని ఫీచర్స్‌ ఫోన్ల నుంచి యూపీఐ (UPI) సేవలు పొందే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటు డిజిటల్‌ పేమెంట్లకు సంబంధించిన కొత్త హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో బ్యాకింగ్‌ సేవలను మరింత సులభతరం చేయవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. తాజాగా ఈ ఫీచర్‌ను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ ఫీచర్‌ ఫోన్‌ కోసం యూపీఐ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ఈ సర్వీసును యూపీఐ 123పే (UPI123ష్ట్రలో) పేరులో విడుదల చేశారు. డిజిటల్‌ పేమెంట్లకు సంబంధించి 24 గంటల హెల్ప్‌లైన్‌ డిపాసాధి (DigiSaathi) సేవలను ఆవిష్కరించింది ఆర్బీఐ. 14431 లేదా 1800 891 3333 నెంబర్ల ద్వారా డిజిటల్‌ పేమెంట్లకు సంబంధించిన సేవలను పొందవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఈ సర్వీసు 40 కోట్ల భారతీయులకు ప్రయోజనం చేకూరనుందని ఆర్బీఐ తెలిపింది.

గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని..

అయితే ఈ సేవలు గ్రామీణ ప్రాంతాలను ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆర్బీఐ. గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ సేవల వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలు రూ.76 లక్షల కోట్లకు చేరాయని, గత ఆర్థిక సంవత్సరంలో రూ.41 లక్షల కోట్లుగా ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్‌ అన్నారు. మొత్తం లావాదేవీల సంఖ్య 100 లక్షల కోట్లకు చేరే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు.

ఒక అంచనా ప్రకారం.. దేశంలో 400 మిలియన్ల మొబైల్ ఫోన్ వినియోగదారులు సాధారణ ఫీచర్ ఫోన్‌లను కలిగి ఉన్నారు. ప్రస్తుతం యుఎస్‌ఎస్‌డి ఆధారిత సేవల ద్వారా యుపిఐ సేవలు అటువంటి వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని, అయితే ఇది చాలా గజిబిజిగా ఉందని, అన్ని మొబైల్ ఆపరేటర్లు అలాంటి సేవలను అనుమతించడం లేదని డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ అన్నారు. ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఇప్పుడు నాలుగు సాంకేతిక ఎంపికల ఆధారంగా విస్తృత శ్రేణి లావాదేవీలను నిర్వహించవచ్చని RBI తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్.. ఈ వస్తువుల ధరలు పెరగనున్నాయ్..

Gold Rates: పైపైకి పోతున్న ప్రీషియస్ మెటల్ ధర.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!