AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఆక్టోబర్‌ 1 నుంచి మారనున్న ఆన్‌లైన్‌ లావాదేవీ నిబంధనలు! ఆర్బీఐ కొత్త రూల్స్‌ ఇవే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 1 నుండి కార్డ్-ఆన్-ఫైల్ టోకనైజేషన్ విదానాన్ని మార్చబోతోంది. కొత్త నిబంధనల అమలుతో డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపులు మరింత సురక్షితంగా ఉంటాయని..

RBI: ఆక్టోబర్‌ 1 నుంచి మారనున్న ఆన్‌లైన్‌ లావాదేవీ నిబంధనలు! ఆర్బీఐ కొత్త రూల్స్‌ ఇవే..
Rbi Tokenisation
Srilakshmi C
|

Updated on: Aug 24, 2022 | 1:59 PM

Share

RBI’s debit, credit card rule to change from October 1: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 1 నుండి కార్డ్-ఆన్-ఫైల్ టోకనైజేషన్ విదానాన్ని మార్చబోతోంది. కొత్త నిబంధనల అమలుతో డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపులు మరింత సురక్షితంగా ఉంటాయని ఆర్బీఐ చెబుతోంది. దీంతో చెల్లింపు, లావాదేవీలు మీరింత సౌలభ్యంగా మారనున్నియి. రిజర్వ్ బ్యాంక్ తాజా నిబంధనల ప్రకారం.. కస్టమర్ ఆన్‌లైన్‌లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో లావాదేవీలు జరిపినప్పుడల్లా ఖాతాకు సంబంధించిన అన్ని వివరాలు ఎన్‌క్రిప్టెడ్ కోడ్‌లో సేవ్ అవుతాయి. అంటే ఏదైనా ఆన్‌లైన్‌లో లేదా యాప్‌లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో లావాదేవీ చేసినప్పుడు, దాని వివరాలు కంపెనీ సర్వర్‌లో సేవ్ అయ్యే విధానం ఇప్పటి వరకు అమలులో ఉంది. మళ్లీ ఆన్‌లైన్‌లో లేదా యాప్‌లో చెల్లింపుల సమయంలో కంపెనీ మళ్లీ పూర్తి వివరాలు అడగకుండా సేవ్‌ చేసుకుంటుంది. దీంతో ఖాతా నంబర్, కార్డ్ నంబర్ మొదలైనవి కంపెనీ సర్వర్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఆన్‌లైన్‌ చెల్లింపుల సమయంలో CVV నమోదు చేస్తే సరిపోతుంది.

ఐతే క్టోబర్ 1 నుంచి కంపెనీ సర్వర్లలో డేటా స్టోర్ చేయడానికి కుదరదని ఆర్బీఐ చెబుతోంది. వారు కార్డ్‌కి సంబంధించిన వివరాలన్నీ ఎన్‌క్రిప్టెడ్ కోడ్‌లో సేల్‌ అవ్వనున్నాయి. ఇలా కార్డు వివరాలు ఎన్‌క్రిప్టెడ్ కోడ్‌లో ఉన్నందున లావాదేవీ సురక్షితంగా ఉంటుంది. హ్యాకింగ్, సైబర్ మోసాల నుంచి కాపాడేందుకే ఈ విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు ఆర్బీఐ తెల్పింది. సైబర్ నేరాల దృష్ట్యా టోకనైజేషన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెల్పింది. నిజానికి జూలై 1 నుంచి ఈ విధానం అమల్లోకి రావలసి ఉంది. ఐతూ కొంత ఆలస్యంగా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.