RBI KYC Rules: మారిన కేవైసీ నియమాలు.. మీ బ్యాంకు ఖాతాను అప్‌డేట్‌ చేయాలా? వద్దా?

RBI KYC Rules: మీ బ్యాంకు అకౌంట్‌కు పూర్తి కేవైసీ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక వేళ కేవైసీ చేసుకోకుండా బ్యాంక ఖాతా నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేవైసీ నిబంధనలు మార్చింది..

RBI KYC Rules: మారిన కేవైసీ నియమాలు.. మీ బ్యాంకు ఖాతాను అప్‌డేట్‌ చేయాలా? వద్దా?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 10, 2024 | 12:13 PM

KYC Update: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉంటుంది. అయితే బ్యాంకు ఖాతాలకు కేవైసీ తప్పనిసరి అవసరం. ఏదైనా వివరాలు అవసరమైనప్పుడు పూర్తిగా కేవైసీ చేసుకోవడం మంచిది.  లేకుంటే ఖాతా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. బ్యాంకు అకౌంట్‌కు కేవైసీ లేకపోతే మీరు ఎలాంటి లావాదేవీలు చేయలేరు. దీని కోసం మీరు ముందు బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఆధార్‌, పాన్‌ కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది. అప్పుడు అకౌంట్లో వివరాలు అప్‌డేట్‌ చేసిన తర్వాత మీ ఖాతాను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

అందుకే బ్యాంకు అకౌంట్‌ రిన్నింగ్‌లో ఉండాలంటే KYC అవసరం. కేవైసీ లేకుండా బ్యాంక్ ఖాతా నిష్క్రియం కావచ్చు. లావాదేవీలను కూడా నిరోధించవచ్చు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కేవైసీ నియమాన్ని మార్చింది. ఈ నిబంధన నవంబర్ నెల నుంచి అమల్లోకి వస్తుంది.

కేవైసీ నిబంధనలను నవంబర్ 6న ఆర్బీఐ మార్చింది. ఇక నుంచి రిస్క్ బేస్డ్ విధానాన్ని అవలంబిస్తామని ఆర్బీఐ తెలిపింది. ఏదైనా ఖాతాలో సమస్య ఉంటే వెంటనే కేవైసీ చేసుకోవాలని బ్యాంకు సూచిస్తుంది. అకౌంట్‌ అప్‌డేట్‌ చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇవి కూడా చదవండి
  • అధిక-రిస్క్ కస్టమర్‌లు – కేవైసీ ప్రతి 2 సంవత్సరాలకు అప్‌డేట్‌ చేయాలి.
  • మీడియం రిస్క్ కస్టమర్ – కేవైసీ ప్రతి 8 సంవత్సరాలకు అప్‌డేట్‌ చేయాలి.
  • తక్కువ రిస్క్ కస్టమర్లు – కేవైసీని ప్రతి 10 సంవత్సరాలకు అప్‌డేట్‌ అవుతుంది.

అన్ని KYCలు కూడా సెంట్రల్ కేవైసీ రికార్డ్ రిజిస్ట్రీలో అప్‌డేట్ చేయవలసిందిగా ఆర్బీఐ కోరింది. కేవైసీని పదే పదే అప్‌డేట్ చేయమని కస్టమర్‌లను అడగడానికి బదులు, ఈ సెంట్రల్ రిజిస్ట్రేషన్ సైట్ నుండి సమాచారాన్ని అప్‌డేట్ చేయమని కోరతారు.

ఏ సందర్భాలలో కస్టమర్ కేవైసీని అప్‌డేట్ చేయాలి?

  • ఏదైనా సమాచారం అసంపూర్ణంగా లేదా తప్పుగా ఉంటే.
  • డౌన్‌లోడ్ చేసిన పత్రం గడువు ముగిసినట్లయితే.
  • ఏదైనా కారణం కోసం అదనపు ధృవీకరణ అవసరమైతే.

ఇది కూడా చదవండి: BSNL: ప్రైవేట్‌ టెలికాం కంపెనీలకు దడ పుట్టిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 4 ప్లాన్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి