Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్ కార్డుదారులు అలర్ట్‌.. ఈ పని చేయకుంటే ఏప్రిల్‌ నుంచి ఉచిత రేషన్‌ అందదు!

Ration Card Rules: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనేక పథకాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా బిపిఎల్ కార్డు అవసరం. మీ ఈ-కెవైసి ఇప్పటికే పూర్తయి ఉంటే, ప్రభుత్వం మీకు ఈ పథకం ప్రయోజనాలను అందించడం సులభం అవుతుంది. ఈకేవైసి చేయకపోతే ప్రభుత్వం అందించే రేషన్ ఆగిపోవచ్చు..

Ration Card: రేషన్ కార్డుదారులు అలర్ట్‌.. ఈ పని చేయకుంటే ఏప్రిల్‌ నుంచి ఉచిత రేషన్‌ అందదు!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 25, 2025 | 2:55 PM

షన్ కార్డ్ హోల్డర్లకు ఒక ముఖ్యమైన అలర్ట్‌. మీరు ఇప్పటివరకు eKYC ప్రక్రియను పూర్తి చేయకపోతే 7 రోజుల్లోపు దాన్ని పూర్తి చేయండి. లేకుంటే ఏప్రిల్ నుండి మీకు రేషన్ ప్రయోజనాలు లభించడం ఆగిపోతుంది. రేషన్ కార్డ్ హోల్డర్ నిర్దేశించిన తేదీలోపు కేవైసీ పూర్తి చేయకపోతే, అటువంటి సభ్యుల పేర్లు రేషన్ కార్డు నుండి తొలగించనున్నారు. ఆ సభ్యులకు ఆహార ధాన్యాల పంపిణీ లేకుండా పోతుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు eKCY చేయించుకోవడానికి వారి పీడీఎస్‌ దుకాణం లేదా డీలర్‌ను సంప్రదించవచ్చు. ఒక లబ్ధిదారుడు వేరే రాష్ట్రంలో నివసిస్తుంటే, ఆధార్ సీడింగ్ కోసం అతను తన సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లవలసిన అవసరం లేదు. లబ్ధిదారులు వారు ఉన్న చోట నుండి సమీపంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణానికి వెళ్లి e-POS యంత్రం ద్వారా eKYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

పంజాబ్, బీహార్, జార్ఖండ్‌లలో ఈకేవైసీకి చివరి తేదీ తేదీ మార్చి 31

జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం eKYC కోసం చివరి తేదీని మార్చి 31గా నిర్ణయించింది. eKCY పూర్తి చేయడానికి హోల్డర్లు తమ పీడీఎస్‌ దుకాణం లేదా డీలర్‌ను సంప్రదించవచ్చు. మీకు ఏదైనా సమస్య ఎదురైతే, మీరు జిల్లా సరఫరా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. లబ్ధిదారులు వారు ఉన్న దగ్గరలోని ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణానికి వెళ్లి e-POS యంత్రం ద్వారా eKYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

బీహార్ నితీష్ కుమార్ ప్రభుత్వం eKYC కి చివరి తేదీని మార్చి 31, 2025 గా నిర్ణయించింది. డీలర్ దుకాణంలో ఆధార్ సీడింగ్ ఉచితంగా జరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు డీలర్ స్థానంలో E-KYC జరుగుతుంది. ఈ విభాగం లబ్ధిదారుల ఫేషియల్ e-KYC సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఏ లబ్ధిదారుడైనా తన మొబైల్ ఫోన్ నుండి e-KYC యాప్ ఆధార్‌ఫేస్RD యాప్ ద్వారా దేశంలోని ఏ ప్రదేశం నుండైనా తన KYCని చేసుకోవచ్చు .

పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ కేంద్రాల నుండి రేషన్ తీసుకునే లబ్ధిదారులకు మార్చి 31ని KYC గడువుగా నిర్ణయించింది. ఇంకా KYC పూర్తి చేసుకోని రేషన్ కార్డుదారులు వీలైనంత త్వరగా తమ దగ్గర ఉన్న ఏదైనా రేషన్‌ కేంద్రం నుండి రేషన్ కార్డులో నమోదు చేసుకున్న వారి మొత్తం కుటుంబ సభ్యుల కేవైసీని పొందాలి. లేకుంటే వారు రేషన్ పొందడంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంకా కేవైసీ పూర్తి చేసుకోని రేషన్ కార్డుదారులు తమ గ్రామ-వార్డులోని సమీప రేషన్ డిపో హోల్డర్ వద్దకు వెళ్లి వారి కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఒక లబ్ధిదారుడు కేవైసీ పూర్తి చేసుకోకపోతే భారత ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం, ఏప్రిల్ 2025 తర్వాత వారికి రేషన్‌ అందదు.

రేషన్ కార్డుదారులకు eKYC ఎందుకు అవసరం?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనేక పథకాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా బిపిఎల్ కార్డు అవసరం. మీ ఈ-కెవైసి ఇప్పటికే పూర్తయి ఉంటే, ప్రభుత్వం మీకు ఈ పథకం ప్రయోజనాలను అందించడం సులభం అవుతుంది. ఈకేవైసి చేయకపోతే ప్రభుత్వం అందించే రేషన్ ఆగిపోవచ్చు.

కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం వల్ల అర్హత ఉన్నవారికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. నకిలీ రేషన్ కార్డు ఎవరి పేరు మీదైనా ఉంటే, దానిని తొలగించవచ్చు. eKYC ప్రక్రియ కింద ప్రతి రేషన్ కార్డు సభ్యుడు తన పేరు, పుట్టిన తేదీ మొదలైన వాటిని తన ఆధార్ డేటాతో సరిపోల్చాలి. నకిలీ కార్డుల ఏరివేతలో భాగంగా దేశ వ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి