PLI Scheme: ఆ పథకం ద్వారా 14 వేల కోట్ల పంపిణీ.. వాణిజ్యానికి ఊతం ఇచ్చేలా కేంద్రం చర్యలు
భారతదేశంలో జనాభా వృద్ధి అధికంగా ఉంటుంది. చైనా తర్వాత ఆ స్థాయి జనాభా వృద్ధి మన దేశంలోనే ఉంది. అయితే చైనాతో పోల్చుకుంటే మన దేశ జీడీపీ తక్కువగానే ఉంది. ముఖ్యంగా చైనా ఉత్పత్తి రంగం కారణంగా వృద్ధి సాధిస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉత్పత్తి రంగానికి ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రొడెక్ట్ లింక్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ను లాంచ్ చేసింది. 2021 నుంచి ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 14 వేల కోట్లను పంపిణీ చేసింది.

ప్రొడెక్ట్ లింక్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కింద భారత ప్రభుత్వం సుమారు రూ. 14,020 కోట్లు పంపిణీ చేసింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ తయారీ, ఐటీ హార్డ్ వేర్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, టెలికాం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్, వైట్ గూడ్స్, ఆటోమొబైల్స్, ఆటో పార్ట్స్, అలాగే డ్రోన్లు, డ్రోన్ భాగాలు వంటి 10 కీలక రంగాలను కవర్ చేస్తుంది. 2021లో ప్రారంభించిన ఈ స్కీమ్ భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఎగుమతులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని వివిధ రంగాల్లో పీఎల్ఐ పథకాల ప్రభావం గణనీయంగా ఉందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది.
ముఖ్యంగా దేశీయ తయారీని ప్రోత్సహించడంతో పాటు ఉత్పత్తి పెరుగుదలకు, ఉద్యోగ సృష్టికి, ఎగుమతుల పెరుగుదలకు సాయం చేసిందని పేర్కొంది. దేశీయ, విదేశీ వ్యాపారవేత్తల నుంచి పెద్దఎత్తున్న పెట్టుబడులను కూడా ఆకర్షించామని స్పష్టం చేసింది. బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైసెస్, ఫార్మాస్యూటికల్స్, టెలికాం, వైట్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, డ్రోన్లు వంటి పరిశ్రమలలోని 176 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సహా 14 రంగాలకు ఈ పథకం కింద మొత్తం 764 దరఖాస్తులు ఆమోదం పొందాయి.
నవంబర్ 2024 నాటికి, దాదాపు రూ.1.6 లక్షల కోట్ల వాస్తవ పెట్టుబడులు నమోదయ్యాయి. దీని ఫలితంగా రూ.14 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి, అమ్మకాలు చేశారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రూ.15.5 లక్షల కోట్ల లక్ష్యానికి దగ్గరగా ఉంది. అలాగే పీఎల్ఐ స్కీమ్ 11.5 లక్షల మందికి పైగా ప్రత్యక్ష. పరోక్ష ఉపాధి అవకాశాలను కూడా సృష్టించింది. అదనంగా స్పెషాలిటీ స్టీల్ కోసం పీఎల్ఐ పథకంలో రూ.27,106 కోట్లలో రూ. 20,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. దీని వల్ల 9,000 ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..