Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఉద్యోగులకు కీలక అలర్ట్!
Rain Alert: గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 37 అడుగులకు చేరింది. దిగువకు 6 లక్షల 72వేల క్యూసెక్కుల వరద వెళ్తుంది. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. భద్రాచలం నుంచి దిగువన..

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. నేడు ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశముంది. ఇవాళ తెలుగురాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని అధికారులు తెలిపారు. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్షసూచన ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక జారీ చేసింది. నేడు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 3 జిల్లాలకు ఆరెంజ్, 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: LIC: ఎల్‌ఐసీ పాలసీదారులకు సువర్ణావకాశం.. నిలిచిపోయిన పాలసీల పునరుద్దరణ!
ఇదిలా ఉండగా, గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 37 అడుగులకు చేరింది. దిగువకు 6 లక్షల 72వేల క్యూసెక్కుల వరద వెళ్తుంది. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. భద్రాచలం నుంచి దిగువన పోలవరానికి వరద ప్రవాహం వెళ్తుంది. దీంతో.. ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తం అయ్యారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు:
రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా నగరంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసులు పలు సూచనలు జారీ చేశారు. అవసరమైతే ఈ మూడు రోజుల వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని ఐటీ ఉద్యోగులకు సూచించారు. భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ రద్దు పెరిగే అవకాశం ఉందని, దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.
ఇది కూడా చదవండి: Chatgpt Advice: కొంపముంచిన చాట్ జీపీటీ సలహా.. మూడు వారాలు ఆస్పత్రిలో.. అసలేమైందంటే..
అలాగే 19, 20 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంబైని వరదలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్ అతలాకుతలమైంది. హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 15 పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి. జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
ఇది కూడా చదవండి: iPhone 15: ఆపిల్ ప్రియులకు కళ్లు చెదిరే ఆఫర్.. కేవలం రూ.32 వేలకే ఐఫోన్ 15
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








