Jio Plan: జియోలో రూ.189 చౌకైన ప్లాన్.. డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, వ్యాలిడిటీ ఎంతో తెలుసా?
Jio Plan: జియో ఈ ప్లాన్ కాలింగ్, తక్కువ డేటాను ఉపయోగించే వారికి మాత్రమే కాకుండా OTT కంటెంట్‌ను ఇష్టపడే వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జియో టీవీ, జియో AI క్లౌడ్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ స్టోరేజీ..

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోకు కొత్త, చాలా సరసమైన ప్లాన్‌ను జోడించింది. బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ ప్రారంభించింది. రూ. 189 ధర గల ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు అపరిమిత కాలింగ్, 2GB హై స్పీడ్ డేటా, 300 ఉచిత SMSలను 28 రోజుల పాటు పొందుతారు. తక్కువ ధరతో నెల మొత్తం తమ ఫోన్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్ ఉత్తమమైనది.
ఇది కూడా చదవండి: iPhone 15: ఆపిల్ ప్రియులకు కళ్లు చెదిరే ఆఫర్.. కేవలం రూ.32 వేలకే ఐఫోన్ 15
జియో ఈ ప్లాన్ కాలింగ్, తక్కువ డేటాను ఉపయోగించే వారికి మాత్రమే కాకుండా OTT కంటెంట్‌ను ఇష్టపడే వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జియో టీవీ, జియో AI క్లౌడ్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ స్టోరేజీ అవసరాలను కూడా తీరుస్తుంది. ఈ వాల్యూ ప్యాక్ ప్రత్యేకంగా సెకండరీ సిమ్ ఉన్న లేదా తక్కువ ఇంటర్నెట్‌ను ఉపయోగించే కస్టమర్ల కోసం రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. ఈ ప్లాన్ వినియోగదారులకు రూ.189కి మాత్రమే అందుబాటులో ఉంది. రూ.189, మీరు 28 రోజుల అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత SMSలను పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Electric Scooter: అన్నింటిని వెనక్కి నెట్టి నంబర్ 1గా నిలిచిన ఎలక్ట్రిక్ స్కూటర్!
ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్
ఎయిర్‌టెల్ కూడా రూ.199కి ఇలాంటి ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ చెల్లుబాటు కూడా 28 రోజులు, ఇందులో అపరిమిత కాలింగ్, 2GB డేటా, 300 ఉచిత SMS, ఉచిత నేషనల్ రోమింగ్ ఉన్నాయి. ఎయిర్‌టెల్ వినియోగదారులు దీనితో రూ.17,500 విలువైన పెర్ప్లెక్సిటీ AI సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు. ఇది ఒక ప్రత్యేక డిజిటల్ సాధనం. బ్యాకప్ లేదా సెకండరీ కనెక్షన్‌గా తమ నంబర్‌ను ఉపయోగించే వినియోగదారులకు కూడా ఈ ప్లాన్ మంచిది. మొత్తం మీద జియో కొత్త రూ.189 ప్లాన్, ఎయిర్టెల్ రూ.199 ప్యాక్ రెండూ తక్కువ బడ్జెట్ ప్లాన్లు. రెండు ప్లాన్లకు వాటి స్వంత ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: School Holidyas: దసరా పండగకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








