AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రతి బోగీలో కట్టలు కట్టలు నోట్లు.. దేశంలో ఏకైక రైలు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Indian Railways: ఈ రైలులో భద్రతా అత్యంత కఠినంగా ఉంటుంది. ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎందుకంటే కట్టకట్టలు డబ్బులు చేరవేసే ఈ రైలులో ఆ మాత్రం భద్రతా ఉండాల్సిందే. ఈ రైలులో సాయుధ గార్డులను మోహరించారు. సాధారణ ప్రయాణికులు ఎవరూ ఈ రైలులో..

Indian Railways: ప్రతి బోగీలో కట్టలు కట్టలు నోట్లు.. దేశంలో ఏకైక రైలు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Subhash Goud
|

Updated on: Jul 14, 2025 | 5:52 PM

Share

భారత రైల్వే.. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ ఏది అంటే ఇది మన ఇండియన్‌ రైల్వే అనే చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే భారతీయ రైల్వేలకు సంబంధించి ఎన్నో విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. దేశంలో లోకల్ ట్రైన్ల నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి అత్యాధునిక రైళ్లు వరకు విస్తృత స్థాయిలో రైళ్లు రవాణా సేవలు అందిస్తున్నాయి.

అయితే మన దేశంలో ఓ ప్రత్యేక రైలు ఉంది. ఆ రైలులో ప్రతి బోగీలో కరెన్షీ నోట్లతో నిండి ఉన్న పెట్టెలు ఉంటాయి. మరి ఇది సాధారణమైన రైలు కాదండోయ్‌. ఇది ట్రెజరీ ట్రైన్‌. దీనిని E-స్పెషల్‌ రైలు అని కూడా ఉంటాయి. దీనికి ఎంతో ప్రత్యేక ఉంది. ఈ రైలుకు భద్రతా అంతా ఇంతా కాదు. ప్రత్యేక భద్రతా వలయంలో ఈ రైలు నడుస్తుంటుంది. దీని గురించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఒక డాక్యుమెంటరీలో ప్రస్తావించింది. జియో హాట్‌స్టార్‌తో కలిసి ఆర్బీఐ రూపొందించిన ఈ ఐదు భాగాల డాక్యుమెంటరీలో ఆర్బీఐ పనితీరును బాగా వివరించారు. ఇందులో బంగారం ఎక్కడ, ఎలా భద్రపరుస్తారో.. ఎప్పుడు ఎంత బంగారం కొనుగోలు చేయబడుతుందో, నోట్లను ఎలా ముద్రిస్తారో వంటి అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: iPhone 17: ఐఫోన్ 17e ఎప్పుడు రానుందో తెలుసా? కీలక విషయాలు లీక్‌

ఇవి కూడా చదవండి

భారతదేశంలోని ప్రతి రైలు కోచ్‌లో నోట్లతో నిండిన పెట్టెలు ఉంటాయని తెలిపింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ముద్రించిన నోట్లను ఈ రైలు ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు చేరవేరుస్తారని డాక్యుమెంటరీలో తెలిపింది. మరి ఈ రైలు ఎప్పుడు నడుస్తుందా? అలాంటిది ఉండదు. కొన్ని సమయాల్లో మాత్రమే ఈ రైలు నడుస్తుంది. ఆర్బీఐ తన ప్రాంతీయ కార్యాలయాలకు డబ్బును రవాణా చేయడానికి మాత్రమే ఈ రైలు ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. అది కూడా షెడ్యూల్‌ ప్రకారమే ఈ రైలు నడుస్తుంటుంది.

ఇది కూడా చదవండి: Fact Check: సెప్టెంబర్‌ నాటికి రూ.500 నోట్లు నిలిచిపోనున్నాయా? ప్రభుత్వం కీలక ప్రకటన

భద్రత అత్యంత కఠినం:

ఈ రైలులో భద్రతా అత్యంత కఠినంగా ఉంటుంది. ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎందుకంటే కట్టకట్టలు డబ్బులు చేరవేసే ఈ రైలులో ఆ మాత్రం భద్రతా ఉండాల్సిందే. ఈ రైలులో సాయుధ గార్డులను మోహరించారు. సాధారణ ప్రయాణికులు ఎవరూ ఈ రైలులో ప్రయాణించలేరు. ఈ రైలు ఒక రకమైన ప్రత్యేక రైలు. ఇది ఆర్‌బిఐ లేదా ప్రభుత్వ సంస్థలకు మాత్రమే నడుస్తుంది. ఈ రైలు భారతీయ రిజర్వ్ బ్యాంక్‌తో అనుసంధానించి ఉంది.

ఈ ట్రైన్‌లో ప్రయాణించే నోట్లను, బంగారాన్ని అత్యంత జాగ్రత్తగా భద్రపరుస్తారు. ప్రతి కోచ్‌లోనూ ఉన్న నోట్ల పెట్టెలు ప్రత్యేక సీసాలతో, తేలికగా తెరవలేని విధంగా, అత్యున్నత భద్రతా ప్రమాణాల కింద ఉంచుతారు. ఈ కారణంగా ట్రెజరీ ట్రైన్‌ను బలమైన పాస్‌వర్డ్‌లు, సాంకేతిక పరికరాలతో కూడిన సీసా లాక్‌లతో కాపాడుతారు.

ఇది కూడా చదవండి: Auto News: ఈ బైక్‌ ఫుల్ ట్యాంక్‌తో 780 కి.మీ మైలేజీ.. ఫీచర్స్‌, ధర ఎంతో తెలుసా..?

ఇది కూడా చదవండి: MG Cars: ఎంజీ మోటర్‌ అదిరిపోయే ఆఫర్‌.. ఈ కారుపై ఏకంగా రూ.3.50 లక్షల డిస్కౌంట్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి