- Telugu News Photo Gallery Business photos Do you know what harm can be caused by keeping money in the phone cover?
Tech Tips: మీ ఫోన్ బ్యాక్ కవర్‌లో బ్యాంకు కార్డులు, నోట్లను పెడుతున్నారా? పెద్ద ప్రమాదమే!
Tech Tips: కొన్నిసార్లు మీ ఫోన్ అధిక ఉష్ణోగ్రత కారణంగా వేడెక్కవచ్చు. ఎక్కువ సేపు ఎండలో ఫోన్ వాడకుండా ఉండండి. ఫోన్ ఛార్జ్‌లో ఉన్నప్పుడు ఏ కారణం చేతనైనా గేమింగ్ లేదా ఫోన్‌ని ఉపయోగించడం మానుకోండి. ఛార్జింగ్ పెట్టే సమయంలో వాడితే ఫోన్..
Updated on: Jul 13, 2025 | 8:43 PM

మీరు మీ ఫోన్ వెనుక కవర్‌పై నోటు, డబ్బు లేదా ఏదైనా పేపర్ వస్తువును ఉంచినట్లయితే జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీరు పెద్దగా నష్టపోవచ్చు. మీ ఫోన్ పేలిపోవచ్చు. గత కొన్ని నెలలుగా మొబైల్ ఫోన్లు పేలిపోతున్న కేసులు నమోదవుతున్నాయి . మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే దీనికి కారణమని చెప్పవచ్చు. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. ఏటీఎం కార్డు, మెట్రోకార్డు, నగదును మొబైల్ వెనుక కవర్‌లో ఉంచుకోవడం కూడా ఖరీదైన, చౌక ఫోన్‌లు పేలడానికి ఒక కారణమని తెలుస్తోంది.

స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫోన్ మందపాటి కవర్‌తో ఉండటమే దీనికి ప్రధాన కారణం. దీనితో పాటు, కవర్ లోపల అనేక రకాల వస్తువులను ఉంచడం. మీరు ఫోన్‌పై మందపాటి వెనుక కవర్‌ను ఉంచి, ఆ కవర్‌పై వస్తువులను ఉంచినప్పుడు, గాలి గుండా వెళ్లేందుకు ఖాళీ ఉండదు. దీంతో ఫోన్ వేడెక్కడంతోపాటు పేలిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు టెక్ నిపుణులు.

చాలా మందికి మెట్రో కార్డ్, కరెన్సీ నోటు లేదా ఇతర వస్తువులను ఫోన్ వెనుక కవర్‌పై ఉంచడం అలవాటు ఉంటుంది. కొంతమంది ఇది అదృష్టం అని భావిస్తుంటారు. కొందరికి వేరే కారణాలు ఉంటాయి. ఫోన్ కవర్‌పై చాలాసార్లు పేపర్ లేదా డబ్బు ఉంచితే, వైర్‌లెస్ ఛార్జింగ్‌లో సమస్య వస్తుంది. మీ ఈ అలవాటు మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. ఫోన్‌ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు అది పూర్తిగా ఛార్జ్ అయ్యే వరకు పక్కన పెట్టాలి. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని ఉపయోగిస్తే, ఫోన్ వేడెక్కడం, పేలిపోయే ప్రమాదం ఉంది.

వీటిని గుర్తుంచుకోండి: మీకు ఫోన్‌లో బ్యాక్ కవర్ అవసరమైతే సన్నని, పారదర్శక కవర్ ఉంచండి. వైర్‌లెస్ ఛార్జింగ్‌లో సమస్య ఉండదు. ఫోన్ ఓవర్ హీటింగ్ సమస్యకు అతిపెద్ద కారణాలలో ఒకటి ఫోన్ కవర్ మందంగా ఉండటం, అలాగే ఫోన్ కవర్‌పై డబ్బు, ఏటీఎం కార్డ్, మెట్రో కార్డ్ ఉంచడం. మరొక కంపెనీ ఛార్జర్‌ని ఉపయోగించడం లేదా లోకల్ ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల మీ ఫోన్ హీట్ అవుతుంది. దీంతో ఫోన్ పేలిపోతుంది.

కొన్నిసార్లు మీ ఫోన్ అధిక ఉష్ణోగ్రత కారణంగా వేడెక్కవచ్చు. ఎక్కువ సేపు ఎండలో ఫోన్ వాడకుండా ఉండండి. ఫోన్ ఛార్జ్‌లో ఉన్నప్పుడు ఏ కారణం చేతనైనా గేమింగ్ లేదా ఫోన్‌ని ఉపయోగించడం మానుకోండి. ఛార్జింగ్ పెట్టే సమయంలో వాడితే ఫోన్ పేలిపోయే ప్రమాదం ఎక్కువ. ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు. దాని కవర్‌ను తీసివేయడం మంచిది.

ఫోన్ పేలిపోయే ముందు ఇలా చేయండి: మీ ఫోన్ వేడెక్కడం ప్రారంభించినప్పుడు వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి చల్లబరచండి. కొంత సమయం తరువాత ఫోన్‌ను ఆన్ చేసి దాన్ని ఉపయోగించండి. ఆ తర్వాత కూడా ఫోన్ వేడెక్కుతుంటే, ఫోన్ సెట్టింగ్‌లలో ఏ యాప్ ఎంత బ్యాటరీని ఉపయోగిస్తుందో చెక్ చేసి క్లియర్ చేయండి. అనవసరమైన అప్లికేషన్ ఉంటే, వెంటనే ఫోన్ నుండి అన్‌ఇన్‌స్టాల్ చేయండి.




