Airtel: కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. రీఛార్జ్ ప్లాన్ ధర తగ్గించిన ఎయిర్‌టెల్.. జియోకు గట్టి పోటీ..
కస్టమర్లకు ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్ తెలిపింది. గతేడాది రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచి వినియోగదారులకు టెలికామ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఈ ఏడాది కూడా ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఈ సమయంలో ఎయిర్ టెల్ తన రీఛార్జ్ ధరను తగ్గించింది. ఇది కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.

గతేడాది రీఛార్జ్ ధరలు పెంచి కస్టమర్లకు టెలికామ్ సంస్థలు బిగ్ షాక్ ఇచ్చాయి. కొన్ని ప్లాన్‌లపై రూ.100 రూపాయలు పెరగడంతో కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఎండింగ్‌లోనూ మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచేందుకు టెలికామ్ కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా 10 నుంచి 20శాతం మేర ధరలు పెంచే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో కస్టమర్లకు ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఎయిర్‌టెల్ 5G ప్లాన్ ధరను తగ్గించింది. ఇది కోట్లాది మంది ప్రీపెయిడ్ వినియోగదారులకు రిలీఫ్‌ని ఇస్తుందని చెప్పొచ్చు. జియో, వొడాఫోన్ కంపెనీలకు చెక్ పెట్టేందుకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్ రూ. 379గా ఉండేది. కానీ ఇప్పుడు రూ. 349 కే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌పై రూ.30లను కంపెనీ తగ్గించింది.
ఎయిర్‌టెల్ 349 ప్లాన్ వివరాలు
రూ. 349 ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ ప్రతిరోజూ 2 GB హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5G కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. 5జీ యూజర్లు అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు. 5జీ నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. 28 రోజుల పాటు గడువు ఉంటుంది. గతంలో రూ. 349 ధరలో వినియోగదారులకు రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటాను అందించేది. ఇప్పుడు కంపెనీ ధర తగ్గించడమే కాకుండా డేటాను కూడా పెంచింది. రూ.349 ప్లాన్‌తో అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. ఉచిత హలోట్యూన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ స్ట్రీమింగ్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది.
వీఐ – జియో 5G ప్లాన్స్
వోడాఫోన్ ఐడియా 5G ప్లాన్ రూ.379గా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ అర్ధరాత్రి 12 నుండి ఉదయం 6గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటా, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. మరోవైపు రిలయన్స్ జియో 28 రోజుల చౌకైన ప్లాన్ రూ. 349గా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజూ 2జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో జియో హాట్‌స్టార్, ఉచిత 50 GB AI క్లౌడ్ స్టోరేజ్, 90 రోజుల పాటు జియో టీవీ ప్రయోజనాన్ని అందిస్తోంది.




