అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్
ఆరోగ్యంగా ఉన్న యువత హఠాత్తుగా గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఆకస్మిక మరణాలను ముందే పసిగట్టి, ప్రాణాలను కాపాడేందుకు అమెరికా పరిశోధకులు ఒక విప్లవాత్మక కృత్రిమ మేధ మోడల్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న వైద్య మార్గదర్శకాల కన్నా ఇది ఎంతో కచ్చితమైన ఫలితాలను అందిస్తూ వైద్య రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించిన ఈ ఏఐ సిస్టమ్‌కు ‘మార్స్’ (MAARS – Multimodal AI for Ventricular Arrhythmia Risk Stratification) అని పేరు పెట్టారు. ఇది కార్డియాక్ ఎంఆర్‌ఐ చిత్రాలను, రోగి ఆరోగ్య రికార్డులను సమగ్రంగా విశ్లేషించి, గుండెలో దాగి ఉన్న ప్రమాద సంకేతాలను గుర్తిస్తుంది. ముఖ్యంగా వైద్యులకు సైతం గుర్తించడం కష్టంగా ఉండే గుండె కండరాల మచ్చల నమూనాలను ఇది డీప్ లెర్నింగ్ టెక్నాలజీతో విశ్లేషిస్తుంది. నేచర్ కార్డియోవాస్కులర్ రీసెర్చ్ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. జన్యుపరంగా వచ్చే ‘హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి’ అనే గుండె జబ్బు ఉన్నవారిపై ఈ అధ్యయనం దృష్టి సారించింది. ప్రస్తుతం అమెరికా, ఐరోపాలో అనుసరిస్తున్న వైద్య మార్గదర్శకాలతో ప్రమాదాన్ని అంచనా వేయడంలో కచ్చితత్వం కేవలం 50 శాతంగా ఉంది. అయితే, ‘మార్స్’ మోడల్ ఏకంగా 89 శాతం కచ్చితత్వం చూపించింది. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ కచ్చితత్వం 93 శాతంగా ఉండటం విశేషం. సీనియర్ సైంటిస్ట్ నటాలియా ట్రయానోవా పరిశోధన గురించి వివరిస్తూ.. ప్రస్తుత విధానాల వల్ల కొందరు యువత ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు అనవసరంగా డీఫిబ్రిలేటర్లతో జీవించాల్సి వస్తోందన్నారు. ఈ ఏఐ మోడల్ ద్వారా ఎవరికి ఎక్కువ ముప్పు ఉందో అత్యంత కచ్చితత్వంతో చెప్పగలమని తెలిపారు. ప్రస్తుత అల్గారిథమ్‌లతో పోలిస్తే ఈ ఏఐ మోడల్ తమ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. ఇది వైద్య సంరక్షణలో మార్పు తీసుకురాగలదని కార్డియాలజిస్ట్ జోనాథన్ క్రిస్పిన్ అన్నారు. ఈ మోడల్‌ను మరింత మంది రోగులపై పరీక్షించి, ఇతర గుండె జబ్బుల పరీక్షలకు కూడా విస్తరించాలని పరిశోధకుల బృందం యోచిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

