ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
ఓటీటీలో చాలా రకాలా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇంట్రస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కే సినిమాలు చూడటానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. థ్రిల్లర్ సినిమాలు అలాగే హారర్ మూవీస్ చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. థిల్లర్ సినిమాలకు, హారర్ మూవీలకు ఓటీటీలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ థ్రిల్లర్ ప్రేక్షకులను వణికించేస్తోంది.
అమ్మబాబోయ్ ఈ సినిమా చూడాలంటే దైర్యం కావలసిందే.. దైర్యం లేనివాళ్లు ఈ సినిమా చూడకపోవడమే మంచిది. ఈ సినిమా ఓ హాలీవుడ్ మూవీ.. మనుషుల్ని ముక్కలు చేసి తినే ఫ్యామిలీ గురించి ఈ సినిమా. ఇందులో ఐదుగురు ఓ ట్రిప్ కు వెళ్తారు. కానీ వారు ప్రయాణంలో ఊహించని విధంగా ఓ ఫామ్ హౌస్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వారు ఓ భయానక పరిస్థితిలో చిక్కుకుంటారు. టెక్సాస్ లో సమాధుల్లో శవాలు మాయం అవుతున్నాయని వార్తలు వస్తాయి. దాంతో సాలీ హార్డెస్టీ అనే యువతి, ఆమె అక్క ఫ్రాంక్లిన్ హార్డెస్టీ, ముగ్గురు స్నేహితులు జెర్రీ, కిర్క్, పామ్‌లతో తమ తాత సమాధిని కాపాడుకోవాలని చూస్తారు.అందరూ కలిసి ఓ ట్రిప్ కు వెళ్తారు. మధ్యలో ఓ వ్యక్తికి లిఫ్ట్ ఇస్తారు.. అయితే అతను కొంచం తేడాగా ఉంటాడు. తమ స్నేహితుల్లో ఒకరిని గాయపరుస్తాడు కూడా.. దాంతో అతన్ని వ్యాన్ నుంచి బయటకు తోసేస్తారు. ఆతర్వాత పెట్రోల్ కోసం ఓ బంక్‌కు వెళ్తారు. అక్కడ పెట్రోల్ ఉండదు. దాంతో అక్కడి నుంచి వారు దారిలో ఓ ఫామ్ హౌస్ కనిపిస్తే అక్కడికి వెళ్తారు. అయితే ఆ ఫామ్ హౌస్ లోకి కిర్క్ ముందుగా వెళ్తాడు. అతన్ని ఓ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి చంపేస్తాడు. యాంకర్: ఆ చంపిన వ్యక్తి పేరు లెదర్‌ఫేస్. అతని కుటుంబం మనుషులను చంపి తినే ఫ్యామిలీ. అలాగే పామ్ ను కూడా వాళ్లు చంపేస్తారు. అలా ఒకొక్కరు వారి చేతిలో చనిపోతూ ఉంటారు. చివరకు సాలీ ఒక్కతే మిగులుతుంది. ఆమె ఆ కుటుంబం నుంచి తప్పించుకుందా. ? లేదా అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాలో సీన్ సీన్ కు సస్పెన్స్ అదిరిపోతుంది. ఈ సినిమా పేరు “The Texas Chain Saw Massacre”
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్లాక్ సాల్ట్ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

