పేలిన రిఫ్రిజిరేటర్.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంట్లో సిలిండర్ పేలడం, రిప్రిజియేటర్లు పేలి ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు కూడా మనకు తెలుసు. తాజాగా మళ్లీ ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. సనత్‌నగర్ పీఎస్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్‌లో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఉదయం ఒక్కసారిగా రిఫ్రిజియేటర్ పేలిపోయింది.
ఈ పేలుడుతో ఇల్లంతా మంటలు వ్యాపించి, ఇంట్లోని సామాగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం మంటల్లో కాలిబూడిదైపోయింది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిద కావడంతో బాధిత కుటుంబం లబోదిబోమంటోంది. ఇక అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తనసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

