గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
గూగుల్ మ్యాప్స్ వచ్చాక ప్రయాణం మరింత సులభతరం అయ్యింది. మరీ ముఖ్యంగా నగరాల్లో గూగుల్ మ్యాప్స్ లేని ప్రయాణాన్ని ఊహించుకోలేనంత పరిస్థితి ఉంది. దారి తెలియని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్ ఎంతగానో మేలు చేస్తాయి. అయితే, వీటిని గుడ్డిగా నమ్మితే మాత్రం కొంప కొల్లేరవుతుంది. గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మితే ప్రమాదాలు తప్పవని వరుసగా జరుగుతోన్న సంఘటనలు కూడా హెచ్చరిస్తున్నాయి.
గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని తిరుమల వెళ్తొన్న భక్తులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. టెక్నాలజీని నమ్ముకుని వెళ్తుండగా జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గూగుల్ మ్యాప్ డైరెక్షన్‌లో వెళ్తున్న కారు గుంతలో పడిపోయింది. వడ్లకొండ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మహారాష్ట్రకు చెందిన కొందరు యువకులు నాగపూర్ నుంచి తిరుపతికి వెళ్తున్నారు. గూగుల్ మ్యాప్ ని నమ్ముకుని జనగామ జిల్లా మీదుగా వెళ్తుండగా కారు గుంతలో పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని రక్షించారు. యాక్సిడెంట్ జరిగిన దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికల బోర్డులు పెట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
బ్లాక్ సాల్ట్ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

