మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
మొన్నటి వరకు ఒక్కరి కంటే ఎక్కువ పిల్లల్ని కంటే జైళ్లకు పంపిన ఆ ప్రభుత్వమే.. ఇప్పుడు ఎంత మంది పిల్లల్ని కంటే అంత ఎక్కువ బహుమతులు ఇస్తామంటోంది. ప్రజల మీద అత్యంత కఠినమైన ఆంక్షలు విధించి జనాభాను తగ్గించుకున్న చైనా.. ఇప్పుడు, పడిపోతున్న జనాభాను పెంచుకోవటానికి నానాతంటాలు పడుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని కన్నా ఫర్వాలేదు.. డబ్బులిస్తాం అని ప్రకటిస్తోంది.
రెండో బిడ్డను కన్న తల్లిదండ్రులకు 50 వేల యువాన్లు అంటే మన కరెన్సీలో దాదాపు 6 లక్షల రూపాయలు, మూడో బిడ్డను కన్న వారికి ఏకంగా లక్ష యువాన్లు అంటే 12 లక్షల రూపాయలు ఇస్తామంటూ చైనాలో ఓ రాష్ట్రమైన ఇన్నర్ మంగోలియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తేటతెల్లం అవుతోంది. ఇదే బాటలో పలు స్థానిక ప్రభుత్వాలు పిల్లల్ని కనే జంటలకు నగదు ప్రోత్సాహకాలు, గృహ నిర్మాణానికి సబ్సిడీలను ప్రకటించాయి. తాజాగా, అక్కడి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పుట్టే ప్రతీ శిశువుకూ ఏటా 3,600 యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 43 వేల రూపాయల చొప్పున మూడేళ్ల పాటు ఆ శిశువు తల్లిదండ్రులకు ఇచ్చే పథకంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 1వ తేదీన, ఆ తర్వాత పుట్టిన శిశువులకు దీనిని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జననాలు తగ్గటంతో చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఉద్యోగాలు, పనులు చేయగల వయస్కుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు ఇది తీవ్ర నష్టదాయక పరిణామం. ఇదే పరిస్థితి కొనసాగితే.. 2100 నాటికి చైనా జనాభా ఏకంగా 80 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

