Diwali Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పండగకు ముందు బోనస్‌.. ఎంతో తెలుసా?

కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. చెన్నై మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. మొత్తం 120 స్టేషన్లతో కూడిన ఈ దశలో మూడు కారిడార్లను నిర్మిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్‌ను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మిస్తుంది. దీని మొత్తం వ్యయం..

Diwali Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పండగకు ముందు బోనస్‌.. ఎంతో తెలుసా?
Indian Railways
Follow us

|

Updated on: Oct 04, 2024 | 9:38 AM

కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. చెన్నై మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. మొత్తం 120 స్టేషన్లతో కూడిన ఈ దశలో మూడు కారిడార్లను నిర్మిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్‌ను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మిస్తుంది. దీని మొత్తం వ్యయం రూ.63,246 కోట్లు కాగా, ఇందులో సగం కేంద్రం, మరో సగం నిధులు రాష్ట్రం భరించనున్నాయి.. ఇది కాకుండా, రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత లింక్డ్ బోనస్ (PLB) ఆమోదించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వనున్నారు. కేబినెట్ నిర్ణయంతో 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.

రూ. 2029 కోట్ల పిఎల్‌బి పథకానికి ఆమోదం:

రైల్వే ఉద్యోగుల మంచి పనితీరు కోసం 11,72,240 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే రూ.2,029 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్‌బీ)కి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార ప్రసార, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ట్రాక్ మెయింటెయినర్, లోకో పైలట్, రైలు మేనేజర్ (గార్డ్), స్టేషన్ మాస్టర్, సూపర్‌వైజర్, టెక్నీషియన్, టెక్నీషియన్ హెల్పర్, ‘పాయింట్స్‌మన్’, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర ఉద్యోగుల వంటి వివిధ కేటగిరీల రైల్వే ఉద్యోగులకు ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

నూనెగింజలపై జాతీయ మిషన్‌

ఎడిబుల్ ఆయిల్-నూనె గింజలపై జాతీయ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకంపై వచ్చే ఆరేళ్లకు అంటే 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు రూ.10,103 కోట్లు ఖర్చు చేస్తారు. 2022-23 సంవత్సరంలో ప్రాథమిక నూనెగింజల ఉత్పత్తిని 3.9 కోట్ల టన్నుల నుంచి 2030-31 నాటికి 6.97 కోట్ల టన్నులకు పెంచడమే మిషన్ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఇది కాకుండా మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు శాస్త్రీయ భాష హోదా కల్పించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న దసరా స్పెషల్‌ లేజర్‌ షో
ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న దసరా స్పెషల్‌ లేజర్‌ షో
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్