Budget 2023: బడ్జెట్‌లో కేంద్రం రైల్వేకు పెద్ద పీట వేయనుందా..? కీలక ప్రకటన చేసే అవకాశం..!
కేంద్ర బడ్జెట్ 2023ని మరికొన్ని పార్లమెంట్‌లో మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, రైల్వేలకు సంబంధించి కూడా ప్రభుత్వం..
కేంద్ర బడ్జెట్ 2023ని మరికొన్ని పార్లమెంట్‌లో మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, రైల్వేలకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేక ముఖ్యమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. మరికొన్ని కొత్త రైళ్లను నడిపే విషయమై బడ్జెట్‌లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు హైస్పీడ్ రైళ్లకు సంబంధించి కూడా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. మోడీ ప్రభుత్వం హైస్పీడ్ రైళ్లపై నిరంతరం దృష్టి సారిస్తోంది. వందే భారత్ రైలును ప్రారంభించిన కేంద్రం.. బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు కూడా జరుగుతున్నాయి. 2017లో రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేశారు. ఆర్థిక మంత్రి ఇప్పుడు అదే రోజు సమీకృత బడ్జెట్‌ను సమర్పిస్తారు. మరికొన్ని వందేభారత్ రైళ్లను నడిపేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
వీటిలో రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌తో సహా ప్రస్తుతం ఉన్న అన్ని హై-స్పీడ్ రైళ్లను క్రమక్రమంగా మార్చడం, ముఖ్యమైన మార్గాల్లో గంటకు 180 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇది కాకుండా, 2025-26 నాటికి తూర్పు ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా మార్కెట్‌లకు ఎగుమతి చేయడానికి రైళ్ల తయారీకి పునాది వేయనున్నట్లు తెలుస్తోంది.
భారతీయ రైల్వేల వేగం, ఎగుమతి సామర్థ్యాలను పెంచడానికి ఈ ప్రణాళికతో పాటు, బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి నిధుల కేటాయింపులో పెరుగుదల కూడా ఉండవచ్చు. ఈ బడ్జెట్‌లో, 2024 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ద్వారా బడ్జెట్ ను రూ.1.9 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉంది. రైల్వే మంత్రిత్వ శాఖ రాబోయే ఆర్థిక సంవత్సరంలో తన మొత్తం మూలధన వ్యయంలో 20 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.2.45 లక్షల కోట్లు. కొత్త లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, సరకు రవాణా కారిడార్ల మెరుగుదల, గేజ్ మార్పిడి, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుదల, ఇతర ఆధునీకరణ వంటి పనులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి