AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB FD: ఎఫ్‌డీ చేసే వారికి గుడ్ న్యూస్.. ఆ బ్యాంకులో భారీగా పెరిగిన వడ్డీ.. పూర్తి వివరాలు..

పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఒకటి. ఇటీవల ఈ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొన్ని కాలవ వ్యవధుల్లో 45 బేసిస్ పాయింట్లను పెంచింది. కొన్నింటిపై తగ్గించింది. కొత్త రేట్లు 1 జనవరి 2024 నుంచి అమలులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

PNB FD: ఎఫ్‌డీ చేసే వారికి గుడ్ న్యూస్.. ఆ బ్యాంకులో భారీగా పెరిగిన వడ్డీ.. పూర్తి వివరాలు..
Fixed Deposit
Madhu
| Edited By: |

Updated on: Jan 03, 2024 | 7:09 PM

Share

బ్యాంకింగ్ సెక్టార్లో ప్రజలు అత్యంత విశ్వసించే, అత్యధికంగా పెట్టుబడులు పెట్టే పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్లు. వీటిల్లో పెట్టే డబ్బులకు భద్రత ఉండటంతో పాటు అధిక రాబడి వస్తుంది. అయితే బ్యాంకులను బట్టి దీనిలో వడ్డీ రేట్లు, ప్రయోజనాలు మారుతుంటాయి. ఏ బ్యాంకులో మంచి వడ్డీ వస్తుంది? ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయి అనేది ముందుగా తెలుసుకోవడం ఉత్తమం. ఇటీవల ఆర్బీఐ రెపో రేటును యథావిధిగా ఉంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ ఎఫ్ డీ స్కీమ్లపై వడ్డీ రేట్లను పెంచాయి. వాటిల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఒకటి. ఇటీవల ఈ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొన్ని కాలవ వ్యవధుల్లో 45 బేసిస్ పాయింట్లను పెంచింది. కొన్నింటిపై తగ్గించింది. కొత్త రేట్లు 1 జనవరి 2024 నుంచి అమలులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వడ్డీ రేట్లు ఇలా..

పీఎన్జీ సాధారణ పౌరులకు 180 నుంచి 270 రోజుల వ్యవధిపై వడ్డీ రేటును 5.5 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. 271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధిపై రేట్లు 5.80 నుంచి 6.25 శాతానికి చేర్చింది.  అలాగే 400 రోజుల కాలవ్యవధికి 6.80 శాతం నుంచి 7.25 శాతానికి బ్యాంకు పెంచింది. అయితే 444 రోజుల కాలవ్యవధిపై వడ్డీ రేటును తగ్గించింది. 60 ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లు 50 బీపీఎస్ అదనపు వడ్డీ రేటును పొందుతారు.

ఇవి కూడా చదవండి

పెరిగిన వడ్డీ రేట్లు ఇలా..

పీఎన్బీ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల కంటే తక్కువ) ఉన్న వాటిపై పెంచిన వడ్డీ రేట్లు జనవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. పెరిగిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
  • 7 నుంచి 45 రోజుల కాల వ్యవధికి సామాన్య పౌరులకు 3.50శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 4శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 4.30శాతంగా ఉన్నాయి.
  • 46 నుంచి 179 రోజుల వ్యవధికి సామాన్య పౌరులకు 4.50శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 5శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 5.30శాతంగా ఉన్నాయి.
  • 180 నుంచి 270 రోజుల కాల వ్యవధికి సామాన్య పౌరులకు 5.50శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 6.50శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 6.80శాతంగా ఉన్నాయి.
  • 271 రోజుల నుంచి ఒక సంవత్సరం కన్నా తక్కువ కాల వ్యవధికి సామాన్య పౌరులకు 6.25శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 6.75శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.05శాతంగా ఉన్నాయి.
  • 1 సంవత్సరం వ్యవధితో చేసే డిపాజిట్లపై సామాన్య పౌరులకు 6.75శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.25శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.55శాతంగా ఉన్నాయి.
  • 399 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు కాల వ్యవధిపై సామాన్య పౌరులకు 6.80శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.30శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.60శాతంగా ఉన్నాయి.
  • 400 రోజుల వ్యవధికి సామాన్య పౌరులకు 7.25శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.75శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 8.05శాతంగా ఉన్నాయి.
  • 401 రోజుల నుంచి 443 రోజుల వరకూ సామాన్య పౌరులకు 6.80శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.30శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.60శాతంగా ఉన్నాయి.
  • 444 రోజుల  వ్యవధికి సామాన్య పౌరులకు 6.80శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.30శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.60శాతంగా ఉన్నాయి.
  • 445 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు సామాన్య పౌరులకు 6.80శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.30శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.60శాతంగా ఉన్నాయి.
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు సామాన్య పౌరులకు 7.00శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.50శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.80శాతంగా ఉన్నాయి.
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు సామాన్య పౌరులకు 6.50శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 6.50శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.30శాతంగా ఉన్నాయి.
  • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సామాన్య పౌరులకు 6.50శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.30శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.30శాతంగా ఉన్నాయి.
పీఎన్బీ ఉత్తమ్ (నాన్-కాల్ చేయదగినది) ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ (రూ. 1 కోటి నుండి రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ కోసం)
  • 91 నుంచి179 రోజుల కాలవ్యవధికి సామాన్య పౌరులకు 4.55శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 5.05శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 5.35శాతంగా ఉన్నాయి.
  • 180 రోజుల నుంచి 270 రోజుల వరకూసామాన్య పౌరులకు 6.05శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 6.55శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 6.85శాతంగా ఉన్నాయి.
  • 271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు వ్యవధికి సామాన్య పౌరులకు 6.30శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 6.80శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.10శాతంగా ఉన్నాయి.
  • ఒక సంవత్సరం లోపు వ్యవధిపై సామాన్య పౌరులకు 6.80శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.30శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.60శాతంగా ఉన్నాయి.
  • 1 సంవత్సరం నుంచి 399 రోజుల వరకూ సామాన్య పౌరులకు 6.85శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.35శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.65శాతంగా ఉన్నాయి.
  • 400 రోజుల  వ్యవధిపై సామాన్య పౌరులకు 6.85శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.80శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 8.10శాతంగా ఉన్నాయి.
  • 401 రోజుల నుంచి 443 రోజుల వరకూ సామాన్య పౌరులకు 6.85శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.35శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.65శాతంగా ఉన్నాయి.
  • 444 రోజుల వ్యవధికి సామాన్య పౌరులకు 6.85శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.35శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.65శాతంగా ఉన్నాయి.
  • 445 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు సామాన్య పౌరులకు 6.85శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.35శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.65శాతంగా ఉన్నాయి.
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు సామాన్య పౌరులకు 7.05శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.55శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.85శాతంగా ఉన్నాయి.
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు సామాన్య పౌరులకు 6.55శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.05శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.35శాతంగా ఉన్నాయి.
  • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సామాన్య పౌరులకు 6.55శాతం కాగా, సీనియర్ సిటిజెన్స్ కు 7.35శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.35శాతంగా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..