AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porsche Macan Turbo EV: భారత్‌లో ప్రీమియం ఈవీ కార్ల జాతర.. రూ.1.65 కోట్లతో మరో కారు ఎంట్రీ

భారతదేశంలో పోర్స్చే కేవలం రూ.1.65 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో ఉండే మకాన్ టర్బోను మాత్రమే విక్రయిస్తుంది. ఈ కారు కోసం పోర్షే ఇండియా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి ఫోర్షే మకాన్‌ టర్బో ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

Porsche Macan Turbo EV: భారత్‌లో ప్రీమియం ఈవీ కార్ల జాతర.. రూ.1.65 కోట్లతో మరో కారు ఎంట్రీ
Porsche Macan Turbo
Nikhil
|

Updated on: Jan 27, 2024 | 8:30 AM

Share

ప్రపంచవ్యాప్తంగా స్కెచ్ డిజైన్లను విడుదల చేసిన తర్వాత పోర్షే భారత మార్కెట్లో మకాన్ ఈవీని విడుదల చేసింది. మకాన్ ఈవీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మకాన్ 4, మకాన్ టర్బో వేరియంట్స్‌లో ఈ కారు కొనుగోలుకు సిద్ధంగా ఉంది. అయితే భారతదేశంలో పోర్స్చే కేవలం రూ.1.65 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో ఉండే మకాన్ టర్బోను మాత్రమే విక్రయిస్తుంది. ఈ కారు కోసం పోర్షే ఇండియా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి ఫోర్షే మకాన్‌ టర్బో ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఫోర్షే మకాన్‌ 4 గరిష్టంగా 402 బీహెచ్‌పీ శక్తిని, 650 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5.2 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ  కారు గంట 220 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. కానీ ఈ వెర్షన్ కోసం కంపెనీ 613 కిలోమీటర్లు క్లెయిమ్‌ చేస్తుంది. అలాగే ఈ కారు 95 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో 800 వాట్స్‌ డీసీ DC సిస్టమ్‌లో 270కేడబ్ల్యూను ఉపయోగించి 10 నుంచి 80 శాతానికి పెరగడానికి 21 నిమిషాలు పడుతుంది. అలాగే మకాన్ టర్బో ఓవర్ బూస్ట్ మోడ్లో 630 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 1,130 Nm వరకు గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం 260 కిలోమీటర్లుగా ఉంది. అలాగే ఈ కారు 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మకాన్ టర్బోకు కంపెనీ 591 కిలో మీటర్ల పరిధిని క్లెయిమ్‌ చేస్తుంది. 

మకాన్‌ ఈవీ కారులో ఆడితో కలిసి అభివృద్ధి చేసిన ప్రీమియం ప్లాట్‌ఫారమ్ ఎలక్ట్రిక్ (పీపీఈ) ఆర్కిటెక్చర్ పై ఆధారపడి చేస్తుంది. మకాన్ ఎలక్ట్రిక్ డిజైన్ టేకాన్ నుంచి ప్రేరణ పొందినట్లుగా ఉంటుంది. ఈ కారు పగటిపూట రన్నింగ్ ల్యాంప్‌ల కోసం నాలుగు ఎల్‌ఈడీ ఎలిమెంట్లతో వస్తుంది. అయితే ప్రధాన హెడ్‌ల్యాంప్ సెటప్ ఇప్పుడు బంపర్లో ఉంది. వెనుక ఇప్పుడు కూపే లాంటి డిజైన్ ను కలిగి ఉంది. ఇవి కొత్త ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్లతో ఫ్లాటర్ డిజైన్‌తో వస్తుంది. అలాగే ఈ కారు లైట్బార్ ద్వారా కనెక్ట్ అంతుంది. అలాగే ఇంటీరియర్‌ విషయానికి వస్తేమరింత అప్-మార్కెట్‌గా కనిపిస్తోంది. ఈ కారులో కస్టమర్ మూడు స్క్రీన్ల వరకు పొందవచ్చు, 12.6 అంగుళాల కర్వ్ ఇన్సుస్ట్రుమెంట్‌ క్లస్టర్, 10.9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్  ఆకర్షణయంగా ఉంది. అలాగే ఈ కారులో ఇతరుల కోసం ఐచ్చికంగా 10.9 అంగుళాల టచ్ స్క్రీన్ అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి