RBI: దేశంలో క్రెడిట్ కార్డుల హవా.. ఆర్‌బీఐ ప్రకటనలో కీలక విషయాలు..
ఇదిలా ఉంటే 2019 డిసెంబర్‌లో మొత్తం క్రెడిట్ కార్డల సంఖ్య 55.53 మిలియన్లుగా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 77 శాతం పెరగడం విశేషం. బ్యాంకుల నుంచి నిరంతర ప్రోత్సాహం, ఖర్చు వేసే విధానంలో మార్పులు వస్తున్న కారణంగా ఈ వృద్ధి రేటు పెరిగినట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయమై కేర్ ఎడ్జ్ అసోసియేట్ డైరెక్టర్ సౌరభ్ భలేరావ్ మాట్లాడుతూ.. 'బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీచేయడంలో...
దేశంలో రోజురోజుకీ క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో క్రెడిట్ కార్డులు లభించడమంటే పెద్ద తతంగం ఉండేది. కానీ ప్రస్తుతం బ్యాంకులు పెద్ద ఎత్తున కార్డులను జారీ చేస్తున్నాయి. అలాగే వినియోగదారుల అవసరాలు, ఆసక్తులు, ఆన్‌లైన్ షాపింగ్ పెరగడంతో భారీగా క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది.
తాజా గణంకాల ప్రకారం దేశంలో మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య ఏకంగా 9.79 కోట్ల మార్కును దాటింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 2023 డిసెంబర్ నాటికి 9.79 కోట్లకు చేరింది. అయితే జనవరి నెల కలిపితే 10 కోట్లకు చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇక 2023లో సుమారు కోటిన్నర క్రెడిట్ కార్డులు జారీ కాగా, 2022లో ఈ సంఖ్య 1.2 కోట్ల వరకు నమోదుంది.
ఇదిలా ఉంటే 2019 డిసెంబర్‌లో మొత్తం క్రెడిట్ కార్డల సంఖ్య 55.53 మిలియన్లుగా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 77 శాతం పెరగడం విశేషం. బ్యాంకుల నుంచి నిరంతర ప్రోత్సాహం, ఖర్చు వేసే విధానంలో మార్పులు వస్తున్న కారణంగా ఈ వృద్ధి రేటు పెరిగినట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయమై కేర్ ఎడ్జ్ అసోసియేట్ డైరెక్టర్ సౌరభ్ భలేరావ్ మాట్లాడుతూ.. ‘బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీచేయడంలో ఎక్కువ ఆసక్తిచూపడం, వినియోగదారుల చెల్లింపుల విధానాల్లో మార్పుల కారణంగా క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. ప్రస్తుతం ఒక వ్యక్తికి వారి అర్హతను బట్టి క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నారు. గతంలో క్రెడిట్ కార్డులు పొందడం అంత సులువు కాదు. బ్యాంకులు అనేక రకాల క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టాయి. ఇవి అమలులో ఉన్న క్రెడిట్ కార్డుల పెరుగుదలకు దారితీశాయి. అయితే, ఇప్పుడు వాటిని తగ్గించడం ప్రారంభించారు’ అని చెప్పుకొచ్చారు.
ఇక క్రెడిట్ కార్డులను అధికంగా జారీ చేసిన ప్రైవేట్ రంగ సంస్థల్లో 2023లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది. ఈ బ్యాంక్ 19.81 మిలియన్ కార్డులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో 20 మిలియన్ల మార్కును చేరుకున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ 16.48 మిలియన్లు, ఎస్‌బీఐ కార్డ్ 18.48 మిలియన్లు, యాక్సిస్ బ్యాంక్ 13.58 మిలియన్ల కార్డులు జారీ చేశాయి. ఇక భారతీయుల్లో క్రెడిట్ కార్డు వ్యయం 2023 డిసెంబర్ నాటికి 1.65 ట్రిలియన్లకు పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..