AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Refund: మీ బ్యాంక్ ఎకౌంట్ ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్ తో లింక్ అయిందా? లేకపోతే మీకు ఐటీ రిఫండ్ రాదు..ఎలాగంటే..

ఆదాయపు పన్ను వాపసు(Income Tax Refund) ఈ-రిఫండ్ విధానంలో మాత్రమే ఇస్తామని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.

Income Tax Refund: మీ బ్యాంక్ ఎకౌంట్ ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్ తో లింక్ అయిందా? లేకపోతే మీకు ఐటీ రిఫండ్ రాదు..ఎలాగంటే..
Income Tax Refunds
KVD Varma
|

Updated on: Oct 07, 2021 | 3:29 PM

Share

Income Tax Refund: ఆదాయపు పన్ను వాపసు(Income Tax Refund) ఈ-రిఫండ్ విధానంలో మాత్రమే ఇస్తామని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. పాన్ (PAN)తో లింక్ చేసిన ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ముందుగా ధృవీకరించబడిన బ్యాంక్ ఖాతాలకు మాత్రమే పన్ను వాపసు క్రెడిట్ చేయడం జరుగుతుంది.

మీ ఆదాయపు పన్ను వాపసు (Income Tax Refund) మొత్తం చెల్లించాల్సిన బ్యాంక్ ఖాతా ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ముందుగా ధృవీకరించి ఉందని మీరు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

పోర్టల్‌లో మీ బ్యాంక్ ఖాతా ముందుగా ధృవీకరించి ఉండకపోతే, మీరు ఆదాయ పన్ను వాపసు పొందలేరు. అందువలన మీరు ఆన్ లైన్ లో మీ బ్యాంక్ ఖాతాను ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్ తో అనుసంధానించుకోవాలి. మీరు ఇంట్లో కూర్చొనే, మీ బ్యాంక్ ఖాతా ప్రీ-ధ్రువీకరణ అయిందా లేదా అని మీరు సులభంగా చెక్ చేసుకోవచ్చు.

బ్యాంక్ ఖాతా ముందుగా ధృవీకరించబడిందో లేదోతెలుసుకోండి ఇలా.. ఆదాయపు పన్ను పోర్టల్‌లో మీ ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత, నా ప్రొఫైల్(మై ప్రొఫైల్) ఎంపికపై క్లిక్ చేసి, ఆపై నా బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.

తెరపై మీరు ముందుగా ధృవీకరించబడిన బ్యాంక్ ఖాతాలను చూస్తారు. మీ తరపున ఆదాయపు పన్ను వాపసు స్వీకరించడానికి ఎంచుకున్న బ్యాంక్ ఖాతా కూడా ఇక్కడ కనిపిస్తుంది.

బ్యాంక్ ఖాతాను ముందుగా ధృవీకరించడం ఎలా

– ముందుగా కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌లో మీ ఖాతాకు లాగిన్ అవండి. – ఇప్పుడు నా ప్రొఫైల్ ఎంపికను ఎంచుకోండి. దీని కోసం, మీరు కుడి వైపున ఇచ్చిన మీ పేరుపై క్లిక్ చేయాలి – ఇప్పుడు నా బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి. ఆ తర్వాత బ్యాంక్ ఖాతాను జోడించు ఎంచుకోండి. – తర్వాత ఈ వివరాలను పూరించండి – బ్యాంక్ ఖాతా సంఖ్య, ఖాతా రకం, ఖాతా హోల్డర్ రకం, ఐఎఫ్ఎస్‌సి(IFSC) కోడ్ – ఐఎఫ్ఎస్‌సి వివరాలు ఇచ్చిన తర్వాత, బ్యాంక్ పేరు..బ్యాంక్ శాఖ వివరాలు వాటంతట మీకు అక్కడ కనిపిస్తాయి. – ఈ వివరాలను తప్పనిసరిగా క్రాస్ చెక్ చేసుకోవాలి. మీరు మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామాను కూడా స్క్రీన్‌పై చూస్తారు. అన్నీ సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. – తరువాత, ధృవీకరణ ఎంపికపై క్లిక్ చేయండి – విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాత, మీ బ్యాంక్ ఖాతా మీ ప్రొఫైల్‌కు దానంత అదే లింక్ అయిపోతుంది. – ఆదాయపు పన్ను వాపసు పొందడానికి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఖాతాను నామినేట్ చేయవచ్చు ఖాతా ముందుగా ధృవీకరించబడిందా లేదా అని తనిఖీ చేయడానికి, బ్యాంక్ పేరును చూపించే బాక్స్ కుడి వైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.

ఇప్పుడు బ్యాంక్ వివరాలను చూడండి ఎంచుకోండి. ఇప్పుడు పాప్-అప్ బాక్స్ తెరపై కనిపిస్తుంది. ధృవీకరణ కోసం అభ్యర్థన ఎప్పుడు సమర్పించారు? బ్యాంక్ ఖాతా ధృవీకరించబడిందా లేదా అలాగే అది ముందుగా ధృవీకరించబడిన తేదీ వంటి సమాచారాన్ని ఇది కలిగి ఉంటుంది.

Also Read: Varun Gandhi: బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి ఎంపీ వరుణ్‌గాంధీ, ఆయన తల్లి మేనకాగాంధీ తొలగింపు

Passenger Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు