అన్నదాతలు అలర్ట్..! 36,000 వేల ఉచిత ప్రయోజనాన్ని అస్సలు మిస్ కావొద్దు..
PM Kisan Pension: కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
PM Kisan Pension: కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఒకటి పీఎం కిసాన్ పెన్షన్. మీరు కోరుకుంటే సంవత్సరానికి రూ.36,000 ఉచిత పెన్షన్ పొందవచ్చు. దీనికోసం ప్రభుత్వం ఎటువంటి డాక్యుమెంట్లు అడగదు. అయితే ఇందుకోసం రైతులు ఒక పని చేయవలసి ఉంటుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికింద ప్రతీ రైతులకు సంవత్సరానికి రూ.6,000 వేలను అందిస్తారు. విడతల వారిగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000లను అకౌంట్లో జమ చేస్తారు. అయితే ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ కింద ప్రభుత్వం రైతులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తుంది.
అయితే కిసాన్ సమ్మాన్ నిధికింద రైతులకు అందే డబ్బుల నుంచే పీఎం కిసాన్ పెన్షన్ స్కీం కోసం కూడా డబ్బులు కట్ అయ్యే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా పెన్షన్ కోసం రైతులు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. సెప్టెంబర్ 21, 2021 నాటికి 21,42,876 మంది రైతులు ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజన కింద నమోదయ్యారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) PM కిసాన్ మాన్‌ధన్ యోజన (PMKMY) నిధిని నిర్వహిస్తుంది. ఈ పెన్షన్ పథకం కింద మొదటి దశలో 5 కోట్ల మంది రైతులకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ చెల్లిస్తారు. అంటే ఏటా 36 వేల రూపాయలు. అయితే దీనికి ఒక షరతు ఉంది. 2 హెక్టార్ల వరకు సాగుభూమి ఉన్న రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
PM కిసాన్ మాన్‌ధన్ యోజన ప్రయోజనాలు
1.60 సంవత్సరాల వయస్సు తర్వాత మీరు నెలకు రూ.3000 పెన్షన్ పొందుతారు. 2. దీని కనీస ప్రీమియం రూ.55 నుంచి రూ.200 వరకు ఉంటుంది. 3. పాలసీదారు రైతు మరణిస్తే అతని భార్యకు 50 శాతం అంటే రూ.1500 చెల్లిస్తారు. 4. రైతు చెల్లించే ప్రీమియాన్ని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. 5. రైతు పాలసీని సగంలో వదిలేయాలనుకుంటే డిపాజిట్ చేసిన డబ్బు, దాని వడ్డీని చెల్లిస్తారు. 6. నమోదు కోసం ఎటువంటి రుసుము వసూలు చేయరు.
ఎలా నమోదు చేయాలి..
1.పెన్షన్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందడానికి కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లో రిజిస్ట్రేషన్ చేయాలి. 2. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు వివరాలు సమర్పించాలి 3. మీరు PM కిసాన్ యోజన ప్రయోజనాన్ని పొందలేకపోతే మీరు భూమి వివరాలను తెలపాలి. 4. 2 ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్ అవసరం. 5. నమోదు సమయంలో కిసాన్ పెన్షన్ ప్రత్యేక సంఖ్య, పెన్షన్ కార్డ్ జనరేట్ చేస్తారు.