PMJJBY: నెలకు రూ.36తో రూ.2 లక్షల బీమా.. మోడీ సర్కార్ అద్భుతమైన స్కీమ్
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) ఒక సంవత్సరం పాటు జీవిత బీమా కవరేజీతో ఉంటుంది. దీన్ని ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి. ఇందులో ఏ కారణం చేతనైనా మరణిస్తే జీవిత బీమా సౌకర్యం లభిస్తుంది. ఏదైనా కారణం వల్ల బీమా చేసిన వ్యక్తి మరణిస్తే అతని నామినీకి రూ. 2 లక్షలు అందుతాయి. ఈ పాలసీ తీసుకోవడానికి మీకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు.
భారతదేశంలో ఖరీదైన బీమా ప్రీమియంల కారణంగా చాలా మంది బీమాను కొనుగోలు చేసేందుకు వెనుకాడుతుంటారు. కరోనా తర్వాత బీమా ప్రీమియంలు కూడా పెరిగిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని చౌక బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసకువచ్చిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కూడా వీటిలో ఒకటి. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి పథకం వార్షిక ప్రీమియం కేవలం రూ. 436. నెలవారీగా చూస్తే కేవలం రూ.36 మాత్రమే ఉంటుంది. ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో జీవిత బీమా కవరేజీని అందించడమే ఈ పథకం లక్ష్యం. అయితే ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కేవలం రూ.330 ప్రీమియంతోనే పాలసీని అందించేవారు. ఇప్పుడు ఆ ప్రీమియంను రూ.436కు పెంచారు.
ఈ పథకం బీమా చేసిన వ్యక్తి మరణిస్తే కుటుంబానికి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పాలసీని కొనుగోలు చేయడానికి, మీ కనీస వయస్సు 18 సంవత్సరాలు. అయితే గరిష్ట వయస్సు 55 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ పథకాలు జూన్ 1 నుంచి మే 31 మధ్య ప్రాతిపదికన అమలవుతుంది. అయితే ఈ స్కీమ్‌ల ప్రయోజనాలను పొందాలంటే బ్యాంకు అకౌంట్ ఉండతం తప్పనిసరి. ప్రీమియం చెల్లించే సమయంలో బ్యాంక్ ఖాతా మూసివేయడం లేదా ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల బీమా రద్దు చేయవచ్చని గుర్తించుకోండి.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) ఒక సంవత్సరం పాటు జీవిత బీమా కవరేజీతో ఉంటుంది. దీన్ని ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి. ఇందులో ఏ కారణం చేతనైనా మరణిస్తే జీవిత బీమా సౌకర్యం లభిస్తుంది. ఏదైనా కారణం వల్ల బీమా చేసిన వ్యక్తి మరణిస్తే అతని నామినీకి రూ. 2 లక్షలు అందుతాయి. ఈ పాలసీ తీసుకోవడానికి మీకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. బీమా పాలసీ సమ్మతి లేఖలో కొన్ని నిర్దిష్ట వ్యాధులు పేర్కొన్నారు. మీరు ఆ వ్యాధులతో బాధపడటం లేదని డిక్లరేషన్‌లో ప్రకటించాలి.
ప్రీమియం ఒకేసారి చెల్లించాలి
ఈ పాలసీ సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు ఉంటుంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి స్కీమ్ వార్షిక ప్రీమియం రూ.436. ఎవరైనా సంవత్సరం మధ్యలో ఈ పథకంలో చేరినట్లయితే, ప్రీమియం మొత్తం దరఖాస్తు తేదీ ఆధారంగా నిర్ణయించబడుతుంది.
ఈ బీమాను ఎవరు తీసుకోవచ్చు?
18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒక వ్యక్తికి ఒకటి లేదా వివిధ బ్యాంకులు/పోస్టాఫీసులలో బహుళ ఖాతాలు ఉన్నట్లయితే, వ్యక్తి ఈ బీమాను కేవలం ఒక ఖాతా ద్వారా మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఈ బీమాని పొందడానికి బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసి ఉండాలి.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో ఆటో పునరుద్ధరణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అంటే బీమా వ్యవధి ముగిసిన వెంటనే వచ్చే ఏడాది ప్రీమియం ఆటోమేటిక్‌గా మీ బ్యాంకు ఖాతా నుండి కట్ అవుతుంది. మీరు ఆటోమేటిక్ రెన్యూవల్‌ని ఎంచుకున్నట్లయితే, ప్రతి సంవత్సరం మే 25, మే 31 మధ్య, పాలసీలో రూ. 436 మీ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా తీసివేయబడుతుంది. పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వాత మాత్రమే ఈ బీమా ప్రయోజనం లభిస్తుంది. అయితే ఏదైనా కారణంగా ప్రమాదంలో మరణిస్తే 45 రోజుల షరతు చెల్లదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి