PPF vs EPF: పీపీఎఫ్‌-ఈపీఎఫ్‌ మధ్య తేడాలు.. వడ్డీ రేట్లు.. ఆదాయపు పన్నుశాఖ నియమాలు తెలుసుకోండి

PPF vs EPF: ఉద్యోగుల భవిష్యత నిధి అనేది జీతం పొందే వ్యక్తుల కోసం మాత్రమే రూపొందించబడిన పథకం పీపీఎఫ్‌. ఉద్యోగులు పదవి విరమణ తర్వాత ఆసరాగా నిలిచేది ప్రావిడెంట్‌ ఫండ్‌. పీపీఎఫ్‌..

PPF vs EPF: పీపీఎఫ్‌-ఈపీఎఫ్‌ మధ్య తేడాలు.. వడ్డీ రేట్లు.. ఆదాయపు పన్నుశాఖ నియమాలు తెలుసుకోండి
Follow us
Subhash Goud

|

Updated on: Mar 12, 2022 | 3:23 PM

PPF vs EPF: ఉద్యోగుల భవిష్యత నిధి అనేది జీతం పొందే వ్యక్తుల కోసం మాత్రమే రూపొందించబడిన పథకం పీపీఎఫ్‌. ఉద్యోగులు పదవి విరమణ తర్వాత ఆసరాగా నిలిచేది ప్రావిడెంట్‌ ఫండ్‌. పీపీఎఫ్‌ ఖాతాదారులకు వృద్దాప్యంలో ఆదాయ భద్రతను అందించడానికి ఎంతో సహాయపడుతుంది. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ రెండూ ప్రభుత్వ-ఆధారిత పదవీ విరమణ పథకాలు. ఈపీఎఫ్ (EPF) ప్రధానంగా జీతం తీసుకునే వ్యక్తి కోసం రూపొందించినది. అదే సమయంలో, పీపీఎఫ్(PPF) సాధారణ ప్రజల కోసం రూపొందించారు. ఉద్యోగుల భవిష్య నిధి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రెండింటి కింద రూ .1.5 లక్షల పెట్టుబడి సెక్షన్ 80 సి కింద మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

మీరు ఉద్యోగం చేస్తే పీపీఎఫ్ కి బదులుగా వీపీఎఫ్ ని ఎంచుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. సెబీ రిజిస్టర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ జీతం తీసుకునే వ్యక్తి.. వ్యక్తిగత పన్నును ఆదా చేయాలని ఆలోచిస్తుంటే వీపీఎఫ్ కంటే వీపీఎఫ్ ఒక మంచి ఎంపిక అని పేర్కొన్నారు. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) లో వడ్డీ రేటు 8.5 శాతం. ఇది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌తో పోల్చవచ్చు. అదే సమయంలో పీపీఎఫ్ పై వడ్డీ రేటు ప్రస్తుతం 7.1 శాతంగా ఉంది. వేతనాలు పొందే వారు వీపీఎఫ్ లో సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిబంధనల ప్రకారం.. వేతనం తీసుకునే వ్యక్తి తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు 12 శాతానికి పైగా జమ చేయవచ్చు. దీని కోసం అతను తన కంపెనీ HR ని సంప్రదించాలి. అతను చేరే సమయంలో లేదా ఏదైనా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అలా చేయవచ్చు. VPF కింద యజమాని వాటా పెరగదు. అందుకే అతనికి ఎలాంటి సమస్య లేదు.

VPF అంటే ఏమిటి?

VPF పూర్తి పేరు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్. ఇది EPF స్కీం పొడిగింపు. దీని కారణంగా ఉపాధి ఉన్న వ్యక్తులు మాత్రమే దీన్ని తెరవగలరు. మీరు EPF ఖాతాలో అదనపు డబ్బు జమ చేసినప్పుడు, దానిని VPF అంటారు. ఉదాహరణకు మీ జీతం నుండి 3000 రూపాయల EPF తీసివేయబడి, దానిని ఇష్టానుసారం పెంచి, 4000 లేదా 5000 గా చేయండిజ అప్పుడు అదనపు డబ్బు VPF. ఇది EPF లో 12 శాతానికి భిన్నంగా ఉంటుంది.

ఎవరు తెరవగలరు?

EPF ఖాతా ఉన్న వ్యక్తులు మాత్రమే దీని ప్రయోజనాన్ని పొందవచ్చు. దీనికి ప్రత్యేక ఖాతా లేదు. మీరు మీ PF ఖాతాలో ఎక్కువ డబ్బు జమ చేయాలి. అసంఘటిత రంగంలోని నిరుద్యోగులు మరియు వ్యక్తులు దీనిని సద్వినియోగం చేసుకోలేరు.

ఇవి కూడా చదవండి:

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్‌.. 4 దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గిన పీఎఫ్ వడ్డీ రేటు..!

UPI Payments: డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారికి శుభవార్త.. ఇకపై డెబిట్‌ కార్డు లేకపోయినా యూపీఐ సేవలు..