Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన సేవింగ్స్ స్కీమ్.. ఇందులో చేరితే నెలకు రూ.4,950 పొందవచ్చు
Post Office Scheme: ప్రస్తుతం ఆదాయం రెట్టింపు చేసుకునేందుకు పోస్టాఫీసుల్లో ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. పలు స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల నెలనెల ..
Post Office Scheme: ప్రస్తుతం ఆదాయం రెట్టింపు చేసుకునేందుకు పోస్టాఫీసుల్లో ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. పలు స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల నెలనెల ఇన్‌కమ్ పొందే సదుపాయాలు కూడా ఉన్నాయి. మీకు ప్రతినెల గ్యాంటిగా ఆదాయం కావాలంటే పోస్ట్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (Monthly Income Scheme) ఖాతా తెరవవచ్చు. ఈ పథకంలో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ఈ పథకంలో డబ్బు 100 శాతం సురక్షితం. వివాహితులకు ఈ పథకంలో రెట్టింపు లాభం లభిస్తుంది. ఇందులో సింగిల్, జాయింట్ ఖాతాలు కూడా తెరిచే సౌకర్యం ఉంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ 5 సంవత్సరాలు.
ఒకేసారి పెట్టుబడి
రూ.1000తో కూడా పెట్టుబడి పెట్టి ఈ స్కీమ్ అకౌంట్ పొందవచ్చు. సింగిల్ అకౌంట్ అయితే రూ.4.5 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకంలో 6.6 శాతం వడ్డీ రేటు ఉంటుంది. మీరు రూ.రూ.4.5 లక్షలు డిపాజిట్ చేస్తే.. నెలకు రూ. రూ.2,475 పొందవచ్చు. అదే సంవత్సరానికి రూ.29,700 పొందవచ్చు. అదే రూ.9 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే ప్రతి నెల రూ.4,950, అదే సంవత్సరానికి రూ. రూ.59,400 వరకు పొందవచ్చు.. దీన్ని బట్టి నెలనెల చూసుకుంటే దాదాపు రూ.5వేలు వచ్చినట్లవుతుంది. తదుపరి రీఇన్వెస్ట్‌మెంట్ కింద దీనిని మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
☛ పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) 6.6 శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది.
☛ ఖాతా తెరిచి తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ వరకు వడ్డీ చెల్లించడం జరుగుతుంది.
☛ డిపాజిటర్ ఏదైనా అదనపు డిపాజిట్ చేసినట్లయితే అదనపు డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వబడుతుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఉపసంహరణ తేదీ వరకు సేవింగ్స్ ఖాతాపై వడ్డీ మాత్రమే వర్తిస్తుంది.
☛ పోస్టాఫీసులోని పొదుపు ఖాతాలో ఆటో క్రెడిట్ లేదా ఈసీఎస్ ద్వారా వడ్డీ విత్‌డ్రా చేసుకోవచ్చు.
☛ డిపాజిటర్ స్వీకరించిన వడ్డీపై పన్ను విధించబడుతుంది.
ఖాతా ఎలా ఓపెన్ చేయాలి..?
మీరు మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి ఈ స్కీమ్ ఖాతా తీయవచ్చు. మంత్లీ ఇన్‌కమ్ ఫారమ్‌ను నింపేటప్పుడు మీ గుర్తింపుకార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు కావాల్సి ఉంటుంది. అలాగే ఫారమ్‌తో ఖాతా తెరిచేందుకు పేర్కొన్న మొత్తానికి నగదు లేదా చెక్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం గడువు ముగిసేలోపు ఎటువంటి డిపాజిట్ ఉపసంహరించుకోవడానికి వీలుండదు. ఖాతా తెరవడానికి ముందు లేదా మూడు సంవత్సరాలలోపు ఖాతాను క్లోజ్ చేసుకోవాలంటే డిపాజిట్ చేసిన మొత్తంలో 2 శాతం తగ్గించి మిగతా మొత్తాన్ని వినియోగదారుడికి అందిస్తారు. అలాగే ఖాతా తెరిచిన తేదీ నుంచి 3 సంవత్సరాల తర్వాత అలాగే 5 సంవత్సరాలలోపు ఖాతా మూసివేయబడితే డిపాజిట్ మొత్తంలో 1 శాతం తగ్గించి మిగతా మొత్తాన్ని అందిస్తారు. సంబంధిత పోస్టాఫీసులో పాస్‌బుక్‌తో పాటు సూచించిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడం ద్వారా ఖాతాను ముందస్తుగా మూసివేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి