Today Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేకులు.. ఏ నగరంలో ఎంత ధర ఉందో తెలుసుకోండిలా..!
Today Petrol Diesel Price: గత 42 రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ పడింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి. 19 మే..
Today Petrol Diesel Price: గత 42 రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ పడింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి. 19 మే 2022 (గురువారం) దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరుసగా 43వ రోజు పెట్రోల్ , డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 105.41, డీజిల్ ధర లీటరుకు రూ .96.67గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51 ఉండగా, డీజిల్ ధర రూ.104.77గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.12 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ. 99.83 ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.110.85, డీజిల్ ధర లీటరుకు రూ.100.94గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.105.65కు చేరుకుంది. అయితే ఏపీలో మాత్రం నగరాలను బట్టి స్వల్ప మార్పులు ఉంటాయి. మార్చి 22 నుండి దేశంలో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.10 పెరిగింది. అయితే, రాష్ట్ర స్థాయిలో ఇంధనంపై వేర్వేరు రేట్లు ఉన్నందున, నగరాల్లో చమురు ధరలు భిన్నంగా ఉంటాయి. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ నగరంలో ధరలను చెక్ చేసుకోవచ్చు.
హాంకాంగ్, జర్మనీ, UK వంటి దేశాలతో పోలిస్తే భారతదేశంలో పెట్రోలు చౌకగా ఉంటుంది. కానీ చైనా, బ్రెజిల్, జపాన్, USA, రష్యా, పాకిస్తాన్, శ్రీలంకలతో పోలిస్తే ఖరీదైనది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ అప్‌డేట్ చేస్తారు. పెట్రోలు, డీజిల్ ధరలను సమీక్షించిన తర్వాత చమురు కంపెనీలు ప్రతిరోజూ ధరలను నిర్ణయిస్తాయి. ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ 0.71 శాతం పెరిగి బ్యారెల్‌కు 112.7 డాలర్లను దాటింది. WTI క్రూడ్ 1.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 114 డాలర్లను దాటింది. WTI క్రూడ్ ధర బ్రెంట్ కంటే ఎక్కువగా మారింది.
మీ నగరంలో చమురు ధరను ఇలా చెక్ చేసుకోండి
మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ (ఐఓసీ) కస్టమర్లు ఆర్‌ఎస్‌పీ కోడ్‌ను టైప్ చేసి 9224992249 SMS చేస్తే మీ నగర ధరల వివరాలు వస్తాయి. మీ నగరం యొక్క RSP కోడ్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి