Post Office Insurance Scheme: పోస్టాఫీసు నుంచి అద్భుతమైన ప్రమాద బీమా పాలసీ.. రూ.299కే రూ.10 లక్షలు

ఈ రోజుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎంతో ముఖ్యం. ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఈ ఇన్సూరెన్స్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. కరోనా తర్వాత..

Post Office Insurance Scheme: పోస్టాఫీసు నుంచి అద్భుతమైన ప్రమాద బీమా పాలసీ.. రూ.299కే రూ.10 లక్షలు
Post Office Insurance Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Nov 16, 2022 | 10:59 AM

ఈ రోజుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎంతో ముఖ్యం. ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఈ ఇన్సూరెన్స్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. కరోనా తర్వాత చాలా మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు చేసుకుంటున్నారు. ఇందుకు బీమా సంస్థలు కూడా రకరకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే ప్రమాద బీమా అంటే రోడ్డు ప్రమాదాలో, వాహన ప్రమాదాలో జరిగితేనే వస్తుందనేది అందరి నమ్మకం. కానీ ఏ రకమైన ప్రమాదం జరిగినా బీమా వర్తింపజేసే రెండు పథకాలు పోస్టల్‌ శాఖ తీసుకువచ్చింది. ప్రతి సంవత్సరం రూ.299 లేదా రూ.399 ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల వరకు బీమా మొత్తం చెల్లించే రెండు వేర్వేరు పాలసీలను ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం ఉన్న బీమా పాలసీలకు కొంత భిన్నంగా ఉంటుందని పోస్టల్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

కోవిడ్‌ తర్వాత ఆరోగ్య బీమా చేయించుకునే వారి సంఖ్య మరింత పెరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగతంతోపాటు కుటుంబ సభ్యులకు వర్తించే విధంగా ప్యాకేజీని కూడా అందజేస్తున్నట్లు పోస్టల్‌ అధికారులు తెలిపారు. పోస్టల్‌ శాఖ టాటా ఏఐజీతో కలిసి పనిచేస్తుస్తోంది. ఈ పాలసీ తీసుకోవాలనుకొనేవారు ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఖాతాను తెరవాల్సి ఉంటుంది. పోస్టల్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ నార్త్‌ డివిజన్‌ తెలిపిన వివరాల ప్రకారం..

రూ.399 ప్రీమియం పాలసీలో ఉపయోగాలు:

ప్రతి ఏడాది రూ.399 ప్రీమియం చెల్లించి పాలసీలో చేరిన వారికి దాదాపు 10 రకాల ప్రయోజనాలను కల్పిస్తున్నారు. ఏదైనా ప్రమాదంలో మరణించినా, శాశ్వత పాక్షిక అంగవైకల్యం చెందినా, పక్షవాతం వచ్చినా, అంగ ఛేదం జరిగినా రూ.10 లక్షల వరకు చెల్లిస్తారు. అంతేకాకుండా అంత్యక్రియల కోసం రూ.5వేలు కూడా చెల్లిస్తారు. ఇక పాలసీదారుడి పిల్లలకు చదువుల నిమిత్తం రూ.లక్ష పరిహారం అందజేస్తారు. ఒకవేళ గాయపడి ఇన్‌పేషెంట్‌గా చేరితే ఖర్చుల కోసం రూ.60వేలు, అవుట్‌ పేషెంట్‌ (ఓపీడీ)గా చికిత్స తీసుకొంటే రూ.30వేలు చెల్లిస్తారు. ఆస్పత్రిలో రోజూవారి నగదు కింద 10 రోజుల వరకు ప్రతిరోజు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. దీనితో పాటు రవాణా ఖర్చుల కింద రూ.25వేలు మించకుండా అందజేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

రూ.299 ప్రీమియం పాలసీ బెనిఫిట్స్‌:

రూ.299 ప్రమాద రక్షణ బీమాలో కూడా శాశ్వత పాక్షిక అంగవైకల్యం చెందినా, ఒకవేళ పక్షవాతం వచ్చినా రూ.10 లక్షల వరకు అందజేస్తారు. ఒకవేళ గాయపడి ఇన్‌పేషెంట్‌గా చేరితే ఖర్చుల కోసం రూ.60వేలు, అవుట్‌ పేషెంట్‌ (ఓపీడీ)గా చికిత్స తీసుకొంటే రూ.30వేలు అందిస్తారు. ఇక అంత్యక్రియల ఖర్చులు, పిల్లల చదువు నిమిత్త ఇచ్చే డబ్బు, రవాణా ఖర్చులు, బెడ్‌ ఖర్చులు వంటివి ఈ పథకంలో లేవు. పాలసీదారుడి వయస్సు 18 నుంచి 65 ఏండ్ల మధ్య ఉండాలి. ఈ పాలసీలపై ఏవైనా వివరాలు కావాలంటే మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసును సంప్రదించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?