Post office: డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియడం లేదా.? ఇదే బెస్ట్‌ ఆప్షన్‌

అలాంటి ఓ బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టాఫీస్ గ్రామ్‌ సురక్ష స్కీమ్‌ పేరుతో పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఉద్యోగ విరామం తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఢోకా లేకుండా ఉండొచ్చు. ఇంతకీ ఈ పథకం ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టాఫీస్ ఈ పథకాన్ని...

Post office: డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియడం లేదా.? ఇదే బెస్ట్‌ ఆప్షన్‌
Post Office
Follow us

|

Updated on: May 14, 2024 | 12:41 PM

కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో చాలాలో మంది డబ్బు పొదుపై చేయడంపై ఆసక్తిపెరిగింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా డబ్బులను పొదుపుచేయాలని చేస్తున్నారు. ఇందులో భాగంగానే రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఎలాంటి రిస్క్‌ లేకుండా సొమ్ముకు భద్రతతో పాటు మంచి రిటర్న్స్‌ వచ్చే వాటిపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ రకరకాల పథకాలను అందిస్తున్నాయి.

అలాంటి ఓ బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టాఫీస్ గ్రామ్‌ సురక్ష స్కీమ్‌ పేరుతో పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఉద్యోగ విరామం తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఢోకా లేకుండా ఉండొచ్చు. ఇంతకీ ఈ పథకం ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టాఫీస్ ఈ పథకాన్ని 1955లో ప్రవేశపెట్టారు. ఈ పథకంలో చేరిన వ్యక్తి 80 ఏళ్ల తర్వాత దాని ఫలాలు పొందుతాడు.

ఒకవేళ స్కీమ్‌లో చేరిన వ్యక్తి మధ్యలోనే మరణిస్తే మొత్తం డబ్బులను నామినీకి లేదా కుటుంబ సభ్యులకు అందిస్తారు. 19 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హులుగా చెప్పొచ్చు. ప్రీమియంను మూడు నెలలు, ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి చొప్పున చెల్లించే అవకాశం ఉంది. అదే విధంగా పథకం మెచ్యూరిటీ 55, 58, 60 ఏళ్లుగా ఉంటుంది.

ఉదాహరణకు మీకు మెచ్యూరిటీ తర్వాత రూ. 31 లక్షలు పొందాలనుకుంటే 9 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో పథకాన్ని ప్రారంభించాలి. రూ.10లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారని అనుకోండి. దానికి 55ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లిస్తే.. మెచ్యూరిటీ తర్వాత మీకు రూ. 31.60లక్షల రాబడి వస్తుంది. ఇందు కోసం నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాకాకుండా 58 ఏళ్ల కాల వ్యవధితో తీసుకుంటే మెచ్యూరిటీ తర్వాత మీకు రూ. 33.4 లక్షలు.. ఒకవేళ 60 ఏళ్ల వ్యవధి తీసుకుంటే రూ. 34.60 లక్షలు వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..