Insurance: నెలకు రూ.2 కడితే.. రూ.2 లక్షల బీమా బెనిఫిట్.. కేంద్రం నుంచి అద్భుతమైన స్కీమ్!
Insurance Scheme: పేద ప్రజల భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే వారికి లబ్ధి చేకూర్చే విధంగా పలు పథకాలు అందిస్తోంది. అలాంటి ఒక పథకమే ఈ ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన. ఈ పథకం కింద ఏడాదికి రూ.20 కడితే చాలు.. ఏకంగా రూ.2లక్షల బీమా కవరేజ్‌ను పొందవచ్చు. అంటే నెలకు కేవలం రూ.1.67 పైసలు అంటే దాదాపు రెండు రూపాయలు. కాబట్టి ఈ పథకానికి ఎవరు అర్హులు, దీన్ని ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో బయటకు వెళ్లి వ్యక్తి ఇంటికి తిరిగి వస్తాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక వేళ ఏదైనా జరగరానిది జరిగి కుటుంబ పెద్ద ప్రమాదానికి గురైతే.. ఆకుటుంబ రోడ్డున పడుతుంది. అటువంటి పరిస్థితిలో మనకు ఒక జీవిత భీమా ఉంటే..అది మన కుటుంబ ఆర్థిక భద్రతకు ముఖ్యమైన వనరుగా మారుతుంది. అయితే, ప్రతి ఒక్కరూ భీమా కొనుగోలు చేయడానికి అధిక ప్రీమియంలు చెల్లించలేరు.దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద నెలకు రూ.2 కేంద్రానికి చెల్లిస్తే చాలు.. మీరు ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వం మీ కుటుంబానికి రూ.2లక్షలు అందిస్తుంది.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అంటే ఏమిటి?
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రమాద బీమా పథకం, ఇది సంవత్సరానికి కేవలం ₹20 లేదా నెలకు ₹2 ప్రీమియం చెల్లించడం ద్వారా ₹2 లక్షల వరకు బీమా రక్షణను అందిస్తుంది. ఈ ప్రీమియం అవసరమైన సమయాల్లో కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
PMSBY పథకాన్ని ఎవరు పొందవచ్చు?
18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏ భారతీయ పౌరుడైనా PMSBY బీమా పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం దరఖాస్తుదారుడు యాక్టివ్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. మీకు ఈ పథకాన్ని కొనుగోలు చేస్తే ప్రతి నెల మీ అకౌంట్ నుంచి రూ.2 ఆటో డెబిట్ అవుతాయి.ఒక వేళ మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయితే పథకం స్వయంచాలకంగా ముగుస్తుంది.
ఈ పథకం ప్రయోజనాలు
PMSBY బీమా పథకం కింద, ఒక లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణించినప్పుడు.. బీమా చేయబడిన వ్యక్తి కుటుంబానికి కేంద్రం నుంచి ₹2,00,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నామినీకి లేదా బీమా చేయబడిన వ్యక్తికి క్లెయిమ్ చేయబడుతుంది. మరణించడమే కాకుండా బీమా పొందుతున్న వ్యక్తి ప్రమాదంలో శాశ్వత వైకల్యం (రెండు చేతులు, కాళ్ళు లేదా కళ్ళు కోల్పోవడం వంటివి) కోల్పోయినా కూడా ₹2,00,000 ఆర్థిక సహాయం అందుతుంది.ఒక వేళ పాక్షిక శాశ్వత వైకల్యం (ఒక చేయి/కాలు/కన్ను కోల్పోతే ₹1,00,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది.
PMSBY రెన్యువల్ చేయడం మర్చిపోవద్దు
ఇతర బీమా పథకాల మాదిరిగానే, PMSBY బీమా పథకంలో ₹20 ప్రీమియం ఒక సంవత్సరం పాటు చెబాటులో ఉంటుంది. ఈ ప్రీమియం ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నాటికి మీ ఖాతా నుండి డెబిట్ చేయబడుతుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండి ప్రతి ఏడాది దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ పథకం రద్దు చేయబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




