Home Loan: హోమ్‌లోన్ ఈఎంఐ భారమైందా..? ఈ ఒక్క ట్రిక్‌తో మీ కష్టం తీరినట్లే..
ఈ రోజుల్లో బ్యాంకుల నుంచి హోమ్ లోన్ ఎక్కువమంది తీసుకుంటున్నారు. కొన్ని బ్యాంకులు వీటిపై తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో సొంత ఇల్లు కట్టుకోవడానికి ఆర్ధిక స్తోమత లేనివారు బ్యాంకు నుంచి లోన్ నుంచి నెలనెలా ఈఎంఐ రూపంలో చెల్లిస్తున్నారు.

Home Loan Interest Rates
- సొంతింటి కల సాకారం చేసుకునేందుకు హోమ్‌లోన్ తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. మాములుగా హోమ్ లోన్ కాలవ్యవధి 20 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుంది. ఆలోపు లోన్ మొత్తం క్లియర్ చేయాల్సి ఉంటుంది. కానీ అన్ని ఏళ్ల వరకు మీరు ఆగారంటే మీరు వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. టెన్యూర్ కంటే ముందే మీరు లోన్ కంప్లీట్ చేసుకోవడం వల్ల వడ్డీ డబ్బులు ఆదా అవుతాయి. ఇందుకోసం మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం
- హోమ్ లోన్ తీసుకున్నవారు నెలనెలా ఈఎంఐ రూపంలో చెల్లిస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా 15 రోజులకే ఒకసారి చెల్లించండి. నెలకు ఒకసారి చెల్లిస్తే సంవత్సరంలో 12 ఈఎంఐలు అవుతాయి. అదే 15 రోజులకు ఒకసారి చెల్లించడం వల్ల ఏడాదికి 26 చెల్లింపులు అవుతాయి. నెలకు రెండు సార్లు పే చేయడం వల్ల సంవత్సరానికి 13 ఈఎంఐలు పూర్తైనట్లు భావిస్తారు.
- ఈ అదనపు ఈఎంఐ నేరుగా ప్రిన్సిపాల్ అమౌంట్‌కు వెళుతుంది. దీని వల్ల మీరు చెల్లించాల్సిన లోన్ బ్యాలెన్స్ అనేది త్వరగా తగ్గుతుంది. అంతేకాకుండా మీరు చెల్లించాల్సిన వడ్డీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తోందన్నమాట. బ్యాంకులను ఆశ్రయించి ఇలా లోన్ నెలకు రెండుసార్లు చెల్లించేలా మార్పులు చేసుకోవచ్చు. ఇందుకోసం లోన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు కూడా చేయాల్సిన అవరం ఉండదు.
- మీరు హోమ్‌లోన్ తీసుకున్నప్పుడే నెలకు రెండుసార్లు ఈఎంఐ చెల్లించేలా ఆప్షన్ ఎంచుకోండి. కొన్ని బ్యాంకులు ఇలాంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి. దీని వల్ల మీరు భారీగా డబ్బులు ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మీ లోన్ కూడా వెంటనే తీరిపోతుంది.
- ప్రస్తుతం హోమ్ లోన్లపై ఎస్బీఐ 7.50 శాతం, హెచ్డీఎఫ్సీ 7.90 శాతం, ఐసీఐసీ బ్యాంక్ 8.75 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.45 శాతం, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 7.50 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి.









